edla ashok reddy
-
బీజేపీ విస్తరణకు సంపర్క్ అభియాన్
సాక్షి, హన్మకొండ: పార్టీ విస్తరణలో భాగంగా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రావు పద్మ తెలిపారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. ఇందులో భాగంగా 30వ తేదీ సోమవారం హన్మకొండ రాంనగర్‌లోని నిత్య బాంక్వెట్ హాల్లో జరిగే సదస్సులో కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అలాగే, నగరంలోని పలువురు ప్రముఖులను కలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మేధావులతో పాటు వివిధ వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పెసరు విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడగా మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, నాయకులు సంగని జగదీశ్వర్, పాశికంటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
అంత్యపుష్కరాలను విస్మరించారు
మంగపేట : గో దావరి అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి విమర్శించారు. మంగపేట పుష్కరఘాట్ వద్ద బుధవారం ఆయన పుష్కర స్నానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహాపుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం అంత్య పుష్కరాల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నా రు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్ల వద్ద ఎలాంటి మరమ్మతులు, ఏర్పాట్లు చేయలేదన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 7న మోదీతో మనం సమ్మేళన కార్యక్రమం జరుగనుందని, రాష్ట్రం లోని లక్ష మంది బూత్‌కమిటీ సభ్యులు హాజరవుతారని చెప్పారు. జిల్లా నుంచి పధివేల మంది హాజరువుతున్నామని, ప్రతి మండలం నుంచి 300 మంది హాజరు కావాలని సూచించారు. ఆయ న వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి కుమార్‌గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ చింతలపుడి భాస్కర్‌రెడ్డి, అధికార ప్రతినిధి దశరధం, మండల అధ్యక్షుడు గాజుల క్రిష్ణ, ఉపాధ్యక్షుడు బేత శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కిరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కడియాల తిరుమల్‌రావు, మద్దిని కృష్ణమూర్తి, కున్నం వెంకట్‌రెడ్డి, లింగంపెల్లి శివ ఉన్నారు. -
రైతు సమస్యలు వదిలి విదేశీ పర్యటనలా?
హన్మకొండ సిటీ : రాష్ట్రవ్యాప్తంగా రైతులు వర్షాలు లేక, కరెంటు సరఫరా సక్రమంగా జరగక ఇబ్బందులు పడుతుం టే ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశలో అశోక్‌రెడ్డి మాట్లాడారు. వర్షాభావం, విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆందోళన చెందుతున్నారని, పెట్టుబడి కోల్పో యి ఆదాయం వచ్చే మార్గం లేక అల్లాడుతున్న రైతన్నలను భరోసా కల్పించాల్సింది పోయి విదేశాలకు వెళ్లడం ఎంత వర కు సమంజసమని ప్రశ్నించారు. ఇక పంట రుణాల మాఫీపై ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడం గర్హనీయమని ఆరోపించారు. కాగా, నైజాం పాలన నుంచి విముక్తి పొందిన రోజు సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారి కంగా జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో నాయకులు శ్రీరాముల మురళీమనోహర్, రాజిరెడ్డి, కుమారస్వామి, దిలీప్‌నాయక్, దుప్పటి భద్రయ్య, త్రిలోకేశ్వర్‌రావు, భాస్కర్, రవళి పాల్గొన్నారు. -
పొత్తుతో నష్టపోయాం
హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీతో పొత్తు వద్దని పార్టీ శ్రేణులన్నీ మొత్తుకున్నా జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తమ ఓట్లు టీడీపీకి లాభించాయని, ఆ పార్టీ ఓట్లను తమకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన వారి నాయకులు సహకరించలేదని ఆరోపించారు. మునిసిపల్, పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచామని, జిల్లాలో టీడీపీ గెలిచిన పరకాల, పాలకుర్తి సీట్లు తమ పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే సాధ్యమయిందని చెప్పారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా వారి నుంచి సహకారం అందలేదని, ఈ పరిస్థితి పునరావృతమైందని అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తామని తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలను కష్టాలకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. రబీ సీజన్లో మూడు సార్లు అకాల వర్షాలు పడి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొత్త దశరథం, కాసర్ల రాంరెడ్డి, కుమారస్వామి, గాదె రాంబాబు, రావు అమరేందర్‌రెడ్డి, ఏదునూరి భవాని, కూచన రవళి పాల్గొన్నారు.