అంత్యపుష్కరాలను విస్మరించారు
Published Wed, Aug 3 2016 11:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
మంగపేట : గో దావరి అంత్య పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి విమర్శించారు. మంగపేట పుష్కరఘాట్ వద్ద బుధవారం ఆయన పుష్కర స్నానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. మహాపుష్కరాలను ఘనంగా నిర్వహించిన ప్రభుత్వం అంత్య పుష్కరాల విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నా రు. కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్ల వద్ద ఎలాంటి మరమ్మతులు, ఏర్పాట్లు చేయలేదన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 7న మోదీతో మనం సమ్మేళన కార్యక్రమం జరుగనుందని, రాష్ట్రం లోని లక్ష మంది బూత్‌కమిటీ సభ్యులు హాజరవుతారని చెప్పారు. జిల్లా నుంచి పధివేల మంది హాజరువుతున్నామని, ప్రతి మండలం నుంచి 300 మంది హాజరు కావాలని సూచించారు. ఆయ న వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళపల్లి కుమార్‌గౌడ్, నియోజకవర్గ కన్వీనర్ చింతలపుడి భాస్కర్‌రెడ్డి, అధికార ప్రతినిధి దశరధం, మండల అధ్యక్షుడు గాజుల క్రిష్ణ, ఉపాధ్యక్షుడు బేత శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కిరణ్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కడియాల తిరుమల్‌రావు, మద్దిని కృష్ణమూర్తి, కున్నం వెంకట్‌రెడ్డి, లింగంపెల్లి శివ ఉన్నారు.
Advertisement