రేపు సింగపూర్ పర్యటనకు కేసీఆర్!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి కేసీఆర్ మంగళవారం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు రాత్రికి సింగపూర్, మలేషియా పర్యటనకు వెళ్లనున్నట్టు అధికారులు తెలిపారు. సింగపూర్ లో జరిగే ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ వెంట ఆర్థిక మంత్రి ఈటెల, ఇతర అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 25న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.