రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 రాత పరీక్ష ప్రరంభమైంది. మొత‍్తం 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. నిర్ణీత సమయం అనంతరం నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించక పోవడంతో కొందరు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.
అయితే.. పెద్ద నోట్ల రద్దుతో గ్రూప్-2 అభ్యర్థులనూ చిల్లర కష్టాలు వదల్లేదు. ఇవాళ్టి నుంచి ఏటీఎంలతో డబ్బు డ్రా చేసుకోవచ్చు కదా అని భావించి దూరంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు బయలుదేరిన వారికి నిరాశ తప్పలేదు. గ్రూప్-2 అభ్యర్థుల కోసం ఆర్టీసి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పేపరు-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ), 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... పేపరు-3 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్), 13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... పేపరు-4 (తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్) పరీక్షలు జరగనున్నాయి.