31న గ్రాండ్ టెస్టు
Published Tue, Jul 26 2016 9:19 PM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM
గుంటూరు ఎడ్యుకేషన్: గ్రూప్–2, ఎస్సై పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పీఆర్ రెడ్డి పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో బ్రాడీపేట 3/10లోని ఐఓఎం క్యాంపస్‌లో ఈనెల 31న ఉచిత గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు గుంటూరు ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు వి. ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా రాష్ట్ర, జోనల్ స్థాయిలో ర్యాంకులను ప్రకటిస్తామని పేర్కొన్నారు. తద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్–2, ఎస్సై పరీక్షలకు హాజరు కాగోరు అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభ, ప్రిపరేషన్ తీరును అంచనా వేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఉచిత గ్రాండ్ టెస్ట్‌కు హాజరుకాగోరు అభ్యర్థులు సంస్థ కార్యాలయంలో నేరుగా సంప్రదించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు 93462 45639 నెంబర్లో సంప్రదించాలని కోరారు.
Advertisement
Advertisement