ఆన్‌లైన్‌లో గ్రూప్–2 ఉచిత కోచింగ్
ఆన్‌లైన్‌లో గ్రూప్–2 ఉచిత కోచింగ్
Published Thu, Dec 8 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
– క్లాసులను ప్రారంభించిన ఆర్‌యూ వీసీ
కర్నూలు సిటీ:
నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన కోచింగ్‌ను ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉచితంగా అందిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆర్‌యూలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ తరగతులను వీసీ వై.నరసింహూలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతి, యవకుల కోసం ప్రభుత్వం ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ సదుపాయం కల్పిస్తుందన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌యూ రిజిస్ట్రార్ అమర్‌నాథ్, డీఆర్‌డీఏ ఏపీడీ శివలీల, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement