
గ్రూపు-2 దరఖాస్తుల్లో సవరణకు అవకాశం
వచ్చే నెల 11, 13 తేదీల్లో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు ఫారాల్లోని తప్పులను ఈనెల 22లోగా సవరించుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.
- గ్రూపు-2 దరఖాస్తుల్లో సవరణకు అవకాశం
- టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో తిరస్కరణ జాబితా
హైదరాబాద్: వచ్చే నెల 11, 13 తేదీల్లో గ్రూపు-2 పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు ఫారాల్లోని తప్పులను ఈనెల 22లోగా సవరించుకోవాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. తప్పులు దొర్లిన వారి ప్రతిపాదిత తిరస్కరణ జాబితాను తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొంది.
అభ్యర్థుల పేరు, తండ్రి పేరు, ఫొటో, సంతకం, అర్హత వివరాలు, జెండర్ తదితర వివరాల్లో పొరపాట్లు చేసిన వారి పేర్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపింది. వారంతా వాటిని సవరించుకునేందుకు తమ వెబ్‌సైట్‌లో ‘కరెక్ట్ దేర్ డిటేల్స్’ లింక్ సహాయంతో తప్పులను సవరించుకోవాలని సూచించింది.