త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తాం: టీఎస్పీఎస్సీ | New exam dates will be declared soon about Group -2 exam: TSPSC | Sakshi
Sakshi News home page

త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తాం: టీఎస్పీఎస్సీ

Published Mon, Apr 4 2016 6:40 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

New exam dates will be declared soon about Group -2 exam: TSPSC

హైదరాబాద్: ఈ నెల 24, 25 తేదీలలో జరగాల్సిన గ్రూప్ -2 పరీక్ష వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. గ్రూప్-2 పరీక్షకు సంబంధించి త్వరలోనే కొత్త తేదీలు ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షకు సంబంధించి 439 పోస్టులకు 5,64,431 దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. పోస్టులు పెంచి, పరీక్షను వాయిదా వేయాలని..  నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తునా అభ్యర్థనలు అందిన నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

ఇదిలా ఉండగా, మొన్నటి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్లోనే గ్రూప్-2 పై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పోస్టులు పెంచి గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించిన విషయం విధితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement