
గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేయండి: జనసేన
ఏపీ గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీ సీఎం న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో కోరారు.
అమరావతి: గ్రూప్-2 అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో కోరారు. పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై ప్రభుత్వం, సర్వీస్ కమిషన్ అధికారులు సానుభూతితో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతకాలంగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారని, గ్రూప్-2 ప్రిలిమ్స్‌కు మెయిన్ ఎగ్జామ్స్‌కు మధ్య ఉన్న 45 రోజుల గడువు సరిపోదన్నారు.
ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారిందని, వారు చెబుతున్న విషయాలను పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అభ్యర్థుల్లో కనిపిస్తున్న మానసిక ఆందోళనను సహృదయంతో ప్రభుత్వం అర్ధం చేసుకోవాలని, వారితో చర్చలు జరిపి , ఎవరికీ నష్టం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని జనసేన కోరుతుందని తెలిపారు.