2018 గ్రూప్–2 నిర్వహణ తీరు ఇదీ
ఇప్పుడు మెంటల్ ఎబిలిటీలో ఒక్క పదం
నానా యాగీ చేస్తున్న ఎల్లో మీడియా
సాక్షి, అమరావతి
1. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ‘పేదరికంపై గెలుపు’ ఈ క్రింది వానిలో సాధారణ వేదిక?
2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఎన్‌టీఆర్ విదేశీ విద్య ఆదరణ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది?
3. చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు?
4. ‘పసుపు కుంకుమ’ పథకం ఈ క్రింది వారిలో ఏ వర్గానికి ఒకసారి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది?
5. చంద్రన్న పెళ్లి కానుక పథకం క్రింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందినవారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి (రూ.లలో)... ఏంటి ఈ ప్రశ్నలు అనుకుంటున్నారా?
గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018లో నిర్వహించిన గ్రూప్–2లో అడిగిన ప్రశ్నలు. ఈ ఐదు ప్రశ్నలే కాదు నాటి గ్రూప్–2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై మొత్తం 11 ప్రశ్నలు ఇచ్చారు. ముఖ్యంగా 137 నుంచి 142 వరకు వరుసగా ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు అడిగారు. చివరకు చంద్రబాబు తెచ్చిన అట్టర్ ఫ్లాప్ పథకం పసుపు–కుంకుమపైన కూడా ప్రశ్న ఇచ్చారు. అయితే ప్రభుత్వ పథకాలపై గ్రూప్స్ పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వడమేంటి అని నాడు ఎల్లో మీడియా ప్రశ్నిస్తే ఒట్టు.
ఎందుకంటే నాడు అధికారంలో ఉంది.. ఎల్లో మీడియాకు కావాల్సిన చంద్రబాబు. దీంతో గ్రూప్–2లో 11 ప్రశ్నలు ఇచ్చినా ఎల్లో మీడియా ఇదేంటి అని నిలదీసింది లేదు. ఇక ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తాజాగా నిర్వహించిన గ్రూప్–2లో ఒక పదం మాత్రమే ఇస్తే అది ఎల్లో మీడియాకు పెద్ద పాపంలా కనిపించింది. అందుకే గ్రూప్స్‌లో జగనన్న భజనేనా అంటూ విష కథనాన్ని అచ్చేసింది.
ఒక్క పదానికే ఎల్లో మీడియా రచ్చరచ్చ
తాజాగా ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–2 ప్రిలిమ్స్‌లో ‘మెంటల్ ఎబిలిటీ’ విభాగంలో ఒక సమస్యను పరిష్కరించేందుకు ఓ పేరాను ఇచ్చారు. అందులో ‘ఆడుదాం ఆంధ్ర’ అనే పదం మాత్రమే పేర్కొన్నారు. సదరు పేరాను చదివి 123–125 వరకు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. అంతకుమించి ‘ఈ పథకం ఎప్పుడు పెట్టారు?, ఈ పథకం ఏ తేదీన ప్రారంభించారు?’ అనే ప్రశ్నలు లేవు.
అయినా సరే ‘ఆడుదాం ఆంధ్ర’ అనే ఒక్క పదమే ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. అలాగే 108వ ప్రశ్న.. ‘ఈ క్రింది వాటిలో ఏది తప్పుగా జతచేయబడింది?’లో భాగంగా ఇచ్చిన ‘చేదోడు’ పదం కూడా ఎల్లో మీడియాకు తప్పుగా కనిపించింది. దీంతో తట్టుకోలేక గ్రూప్–2 పరీక్షలోనూ జగనన్న భజన చేస్తున్నారంటూ తప్పుడు కథనాన్ని ప్రచురించింది.
కాగా ఏపీపీఎస్సీ చరిత్రలోనే అత్యధిక మంది అభ్యర్థులు రాసిన పరీక్షగా గ్రూప్–2 ప్రిలిమ్స్ చరిత్ర సృష్టించింది. మంచి స్టాండర్డ్స్‌తో పరీక్ష నిర్వహించిందనే ప్రశంసలు ఏపీపీఎస్సీకి దక్కాయి. దీన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా చివరకు గ్రూప్–2 పరీక్షపైన కూడా విషం చిమ్మడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment