తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-2 రాత పరీక్ష ప్రరంభమైంది. మొత‍్తం 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. నిర్ణీత సమయం అనంతరం నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించక పోవడంతో కొందరు ఆలస్యంగా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగారు.