గ్రూప్‌–2 ఆన్ లైన్ లైన్ ఉచిత శిక్షణ | group-2 online free coaching | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 ఆన్ లైన్ లైన్ ఉచిత శిక్షణ

Dec 17 2016 11:51 PM | Updated on Sep 4 2017 10:58 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్, డీఆర్‌డీఏ ఈజీఎం, జేకేసీ ఆధ్వర్యంలో గ్రూప్‌–2 అభ్యర్థులకు ఆ¯Œన్ లైన్ టెలీకాస్ట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ–వెలుగు పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

అనంతపురం టౌన్  : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్, డీఆర్‌డీఏ ఈజీఎం, జేకేసీ ఆధ్వర్యంలో గ్రూప్‌–2 అభ్యర్థులకు ఆ¯Œన్ లైన్  టెలీకాస్ట్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డీఆర్‌డీఏ–వెలుగు పీడీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ లక్ష్మయ్య స్టడీ సర్కిల్‌ సహకారంతో ఎస్సీ, ఎస్టీ, ఇతర నిరుద్యోగ అభ్యర్థులకు మూడు నెలలు శిక్షణ ఇస్తామన్నారు.  ప్రిలిమినరీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ లో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనంలో జరిగే శిక్షణకు ఇన్చార్జ్‌గా శ్యాం (సెల్‌ నంబర్‌ : 9701452775) వ్యవహరిస్తారు. తాడిపత్రిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రఘునాథరెడ్డి (సెల్‌ నంబర్‌ : 7702100249), హిందూపురంలోని ఎ¯ŒSఎస్‌పీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలలో లక్ష్మి (సెల్‌ నంబర్‌ : 7702100239), కళ్యాణదుర్గంలోని ఎస్‌వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓబుళేసు (సెల్‌ నంబర్‌ : 7702100246), ధర్మవరంలోని కేహెచ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే శిక్షణకు అనంతలక్ష్మి (సెల్‌ నంబర్‌ :7386763456) సెంటర్‌ ఇన్చార్జ్‌లుగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement