సాక్షి, నల్గొండ: వరద నీరు తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. డ్యామ్‌లో ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 48,990 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగులుగా కొనసాగుతోంది.
సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లు ఎత్తివేత..
పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో,ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 8.83 కాగా, ప్రస్తుతం 7.24 టీఎంసీలుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 10,296 క్యూసెక్కులుగా ఉంది.పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 కాగా, ప్రస్తుతం 18.563 టీఎంసీలుగా ఉంది.
శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద..
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ప్లో 84,738 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 634 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1079.10 అడుగులుగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment