సాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లను మూసివేసిన దృశ్యం
సాక్షి, గుంటూరు(విజయపురిసౌత్) : శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లను అధికారులు ఆదివారం మూసివేశారు. శనివారం ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుతం సాగర్‌కు 48,696 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద ఉంది. ఇది 311.1486 టీఎంసీలకు సమానం. సాగర్ కుడికాలువకు 10,120, ఎడమకాలువకు 2,980, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,886, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, డైవర్షనల్ టన్నెల్‌కు 10, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 885 అడుగులు ఉంది. ఇది 215.8070 టీఎంసీలకు సమానం. శ్రీశైలానికి జూరాల, రోజాల నుంచి 79,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
సత్రశాల(రెంటచింతల) : మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మించిన నాగర్జుసాగర్ టైయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 30,300 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ ఎస్.శేషారెడ్డి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం రెండు టర్బైన్ల ద్వారా 45 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment