GatesClosed
-
శ్రీశైలం, జూరాల గేట్లు మూసివేత
గద్వాల రూరల్/దోమలపెంట: ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. జూరాల ప్రాజెక్టుకు 23,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుత్ ఉత్పత్తి కోసం 19,505 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.701టీఎంసీలను నిల్వ చేశారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 19,501, సుంకేసుల నుంచి 8,414 క్యూసెక్కులు మొత్తం 27,915 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 881.6 అడుగులు, 196.561 టీఎంసీల నీటి నిల్వ ఉంది. -
సాగర్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు మూసివేత
సాక్షి, గుంటూరు(విజయపురిసౌత్) : శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద తగ్గుముఖం పట్టడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లను అధికారులు ఆదివారం మూసివేశారు. శనివారం ఆరు క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగింది. ప్రస్తుతం సాగర్‌కు 48,696 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగుల వద్ద ఉంది. ఇది 311.1486 టీఎంసీలకు సమానం. సాగర్ కుడికాలువకు 10,120, ఎడమకాలువకు 2,980, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 32,886, ఎస్ఎల్బీసీకి 2,400, డైవర్షనల్ టన్నెల్‌కు 10, వరదకాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయ నీటిమట్టం 885 అడుగులు ఉంది. ఇది 215.8070 టీఎంసీలకు సమానం. శ్రీశైలానికి జూరాల, రోజాల నుంచి 79,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సత్రశాల(రెంటచింతల) : మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మించిన నాగర్జుసాగర్ టైయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు 3 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 30,300 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ ఎస్.శేషారెడ్డి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం రెండు టర్బైన్ల ద్వారా 45 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుందన్నారు. -
నాగార్జున సాగర్ గేట్లు మూసివేత
సాక్షి, నల్గొండ: వరద నీరు తగ్గడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. డ్యామ్‌లో ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 48,990 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589.50 అడుగులుగా కొనసాగుతోంది. సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లు ఎత్తివేత.. పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీ రెండు గేట్లను ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో,ఔట్‌ఫ్లో 1000 క్యూసెక్కులుగా నమోదయింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 8.83 కాగా, ప్రస్తుతం 7.24 టీఎంసీలుగా ఉంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 10,296 క్యూసెక్కులుగా ఉంది.పూర్తిస్థాయి నీటి నిల్వ 20.175 కాగా, ప్రస్తుతం 18.563 టీఎంసీలుగా ఉంది. శ్రీరాంసాగర్ జలాశయానికి కొనసాగుతున్న వరద.. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఇన్‌ప్లో 84,738 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 634 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1079.10 అడుగులుగా కొనసాగుతోంది. -
జూరాల క్రస్టుగేట్ల మూసివేత
-కొనసాగుతున్న విద్యుదుత్పత్తి జూరాల : కష్ణానది పరివాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లోపై ప్రభావం పడింది. సోమవారం సాయంత్రం జూరాల ప్రాజెక్టు రిజర్వాయర్‌కు కేవలం 52వేల క్యూసెక్కులు వస్తుండటంతో క్రస్టుగేట్లన్నింటినీ మూసివేశారు. జలవిద్యుత్ కేంద్రంలోని ఆరు టర్బైన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ 44వేల క్యూసెక్కులను పవర్‌హౌస్ ద్వారా దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 9.65టీఎంసీలు కాగా 9.29టీఎంసీలను నిల్వ ఉంచారు. జూరాల రిజర్వాయర్ ద్వారా కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల ఎత్తిపోతల పథకాలకు నీటిని పంపింగ్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి ప్రాజెక్టు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో కేవలం 84,688 క్యూసెక్కులు వస్తుండటంతో అన్ని క్రస్టుగేట్లను మూసివేశారు. విద్యుదుత్పత్తి ద్వారా 45వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఈప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 117టీఎంసీలను నిల్వ ఉంచారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు. ప్రస్తుతం 32టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి రిజర్వాయర్‌కు 59,371 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా నాలుగు క్రస్టుగేట్లు తెరవడంతోపాటు విద్యుదుత్పత్తి ద్వారా జూరాల రిజర్వాయర్‌కు 22,072 క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు.