గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద గుర్తు తెలియని మృతదేహం పడిఉంది.
గుంటూరు జిల్లా మాచర్ల మండలం నాగార్జునసాగర్ కొత్త వంతెన వద్ద గుర్తు తెలియని మృతదేహం పడిఉంది. దిగువ కృష్ణాలోని నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గురువారం మధ్యాహ్నం స్థానికులు గమనించి సాగర్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఎడమ మోచేతిపై పుట్టుమచ్చ ఉంది. గళ్ల చొక్కా, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.