గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం | singer sravana bhargavi | Sakshi
Sakshi News home page

గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం

Published Thu, Jan 23 2014 5:11 AM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం - Sakshi

గాయని శ్రావణ భార్గవికి తప్పిన ప్రమాదం

చిట్యాల, న్యూస్‌లైన్: సినీ గాయని శ్రావణభార్గవి నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో జాతీ యరహదారిపై జరిగిన ప్రమాదం నుంచి తృటి లో తప్పించుకున్నారు. విజయవాడలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె బుధవా రం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు.

శ్రావణి ప్రమాణిస్తున్న కారుకు ఎదురుగా చిట్యాల శివారులో రాంగ్‌రూట్‌లో ఓ ట్రాక్టర్ రాగా, దాన్ని తప్పించబోయిన శ్రావణి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కారు టైరు పగిలి నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. ఆనంతరం ఆమె భర్త, గాయుకుడు హేమచంద్ర సంఘటన స్థలానికి చేరుకుని, శ్రావణభార్గవిని మరో కారులో విజయవాడకు తీసుకెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement