
సాక్షి, హైదరాబాద్: పీసీసీ చీఫ్ పదవి కోసం తాను సీరియస్‌గా ట్రై చేస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నష్టం చేసే చట్టాలను బీజేపీ తీసుకొచ్చిందని, రైతులకు మద్దతుగా నేటి బంద్‌లో కాంగ్రెస్ పార్టీ పాల్గొంటుందని తెలిపారు. వ్యవసాయ బిల్లు పార్లమెంట్‌లో పెట్టినప్పుడే సోనియాగాంధీ, కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారని గుర్తుచేశారు. బీజేపీ తపన రాజకీయాల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు. రైతులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం సంగారెడ్డి హైవేను రెండు గంటలు దిగ్బంధం చేస్తామన్నారు. (చదవండి: కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు)
Comments
Please login to add a commentAdd a comment