వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈనెల 15వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నట్లు తెలిసింది. ఇటీవల పీసీసీ చీఫ్‌గా నియమితులైన ఆయన మొదటి సారిగా జిల్లాకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా పార్టీలోని ముఖ్య నేతల మధ్య అంతరాలు ఉన్న విషయం ఆయన దృష్టికి వెళ్లింది. దీంతో ఉత్తమ్ తన మొదటి అధికార పర్యటనను వరంగల్ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిసింది. కాగా, పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు పార్టీలోని అన్ని వర్గాలను సమన్వయం చేసేందుకే జిల్లా పర్యటనకు వస్తున్నట్లు సమాచారం. జిల్లా పర్యటన బుధవారం గాంధీభవన్‌లో జరిగే సమావేశంలో ఖరారవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.