టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్న పలువురు సీనియర్ నాయకులతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావులతో చర్చలు జరుగుతున్నాయని, వారు కాంగ్రెస్‌లోనే కొనసాగేలా ఒప్పిస్తున్నారని ఆయన చెప్పారు.
నేను టీఆర్ఎస్‌లో చేరట్లేదు: సురేష్ రెడ్డి
కాగా, తాను టీఆర్ఎస్ లో చేరడం లేదని మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి తెలిపారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆయన ఫాంహౌస్‌లో కలిసినట్లుగా వచ్చిన వార్తా కథనాలలో వాస్తవం లేదని ఖండించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంతవరకు తాను ఆయనను కలవలేదని, తమ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో 100 ఏళ్లుగా అనుభవం ఉందని, అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని ఆయన చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.