ఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్‌లుగా ఉన్నవారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే మరిన్ని కఠిన నిర్ణయాలకు సమాయత్తమవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది.
పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవాలని చూసిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్ కాంగ్రెస్‌లో ఏర్పడ్డ సంక్షోభం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేసింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆప్ అధికారంలోకి వచ్చింది. కచ్చితంగా పంజాబ్‌లో గెలుస్తామనుకున్న కాంగ్రెస్‌కు.. అక్కడ ప్రతికూల ఫలితాలు రావడం హైకమాండ్ జీర్ణించుకోలేకపోతోంది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేలోపే పార్టీకి తీవ్ర నష్టం కల్గడంతో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే ఆ ఐదు రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్‌లుగా ఉన్నవారిని తొలగిస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment