Breadcrumb
Assembly Election 2022: ముగిసిన యూపీ మూడో దశ పోలింగ్
Published Sun, Feb 20 2022 6:37 AM | Last Updated on Sun, Feb 20 2022 9:23 PM
Live Updates
మూడో దశలో మురిసేదెవరో?
యూపీ: ముగిసిన మూడో దశ పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 57.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
పంజాబ్: ముగిసిన పోలింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 63.44 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
పంజాబ్: మధ్యాహ్నం 3గంటల వరకు 49.81 శాతం పోలింగ్
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3గంటల వరకు 49.81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
యూపీ: మధ్యాహ్నం 3గంటల వరకు 48.81శాతం పోలింగ్
ఉత్తర ప్రదేశ్ మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానకి తరలివస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల వరకు యూపీలో 48.81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఓటేసిన సుఖ్బీర్ సింగ్ బాదల్
శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, ప్రకాష్ సింగ్ బాదల్, హర్సిమ్రత్ కౌర్‌లు ముక్త్సర్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Shiromani Akali Dal (SAD) president Sukhbir Singh Badal along with Parkash Singh Badal and Harsimrat Kaur casts his vote at Muktsar in #PunjabElections2022 pic.twitter.com/bksQO4TVqw
— ANI (@ANI) February 20, 2022
ఓటేసిన పంజాబ్ సీఎం చన్నీ
పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖరార్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రంలో తన ఓట హక్కు వినియోగించుకున్నారు. చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ నియోజకవర్గాల్లో ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
మధ్యాహ్నానికి పంజాబ్‌లో 35.8 శాతం పోలింగ్
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు పంజాబ్‌లో 34.1 శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లరు బారులు తీరడంతో పోలింగ్ జోరందుకుంది.
ఒంటి గంట వరకు యూపీలో 35.8 శాతం పోలింగ్
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిలకు మూడో దశలో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 35.8 శాతం పోలింగ్ నమోదు అయింది.
మేమే గెలుస్తాం.. మాజీ సీఎం అమరీందర్ సింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాటియాలలోని బూత్ నెంబర్ 95-98లో ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాటియాలా నుంచి గెలుస్తున్నాను. మేం ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని అన్నారు. కాంగ్రెస్‌ను ప్రజలు ఓడించి తీరుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Patiala | Punjab Lok Congress founder and former CM Capt Amarinder Singh casts his vote at polling booth number 95-98 pic.twitter.com/ZWErHsLsZp
— ANI (@ANI) February 20, 2022
పోలింగ్ వేళ సోనూసూద్‌కు చేదు అనుభవం
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరఫున మోగా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోగా నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని తెలుసుకునేందుకు సోనూసూద్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లను సోనూ ప్రభావితం చేసే అవకాశం ఉందని శిరోమణి అకాలీదళ్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సోనూసూద్ పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా అతడి కారును ఈసీఐ స్వాధీనం చేసుకుంది.
ఓటు వేసిన ములాయం సింగ్, డింపుల్ యాదవ్
యూపీలో మూడో దశ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీ ఫౌండర్ మూలయం సింగ్ యాదవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జస్వంత్‌పూర్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. అదే పోలింగ్ బూత్‌లో అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ కూడా ఓటు వేశారు.
#WATCH | Etawah | Samajwadi Party (SP) founder-patron Mulayam Singh Yadav arrives at a polling booth in Jaswantnagar, Saifai to cast his vote for the third phase of #UttarPradeshElections2022 pic.twitter.com/k59H8zsnEC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
11 గంటల వరకు యూపీలో 21.1 శాతం పోలింగ్
యూపీలో ఆదివారం మూడో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, 11 గంటల వరకు అక్కడ 21.1 శాతం పోలింగ్ నమోదు అయింది.
పంజాబ్‌లో 11 గంటల వరకు 17.77 శాతం పోలింగ్
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కాగా, 11 గంటల వరకు అక్కడ 17.77 శాతం పోలింగ్ నమోదు అయింది.
యూపీలో విజయం మాదే : అఖిలేష్ యాదవ్
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్, సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్హల్‌లోని జస్వంత్‌నగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. యూపీ రైతులు, ప్రజలు బీజేపీని క్షమించరు. వారు ఆ పార్టీని తిరస్కరించారు. తాము(ఎస్పీ) మొదటి రెండు దశల్లోనే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించామని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. మూడో దశ పోలింగ్‌లో కూడా ఎస్పీ కూటమి దూసుకెళ్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
BJP going to be eliminated. Farmers of UP won't forgive them. We've hit century in first 2 phases & even in this phase SP & alliance would be ahead of everyone else: SP chief & party's candidate from Karhal, Akhilesh Yadav after voting in Jaswantnagar#UttarPradeshElections2022 pic.twitter.com/xDS7FVmwB0
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
ఓటు వేసిన పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్ డిప్యూటీ సీఎం సుఖ్జిందర్ సింగ్ రంధవా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. డేరా బాబా నానక్ బూత్‌లో ఓటు వేశారు.
Punjab Deputy CM & Congress leader Sukhjinder Singh Randhawa casts his vote at a polling booth in Dera Baba Nanak#PunjabElections2022 pic.twitter.com/HZFBZinbVB
— ANI (@ANI) February 20, 2022
ఎన్నికల నిబంధనల ఉల్లంఘన.. మేయర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
యూపీలో మూడో దశలో ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, కాన్పూర్ మేయర్ ప్రమీలా పాండే.. హడ్సన్ స్కూల్ పోలింగ్ స్టేషన్లో తన ఓటును వేశారు. ఈ క్రమంలోనే ఆమె పోలింగ్ బూత్‌లో ఈవీఎంతో పాటు ఓటు వేస్తున్న ఫొటోను తీసుకొని షేర్ చేశారు. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కాన్పూర్ నగర్ డీఎం తెలిపారు.
#UttarPradeshElections2022 | FIR lodged against Kanpur mayor Pramila Pandey under relevant sections for breach of secrecy of voting at Hudson School polling station, says DM Kanpur Nagar
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 20, 2022
She had shared pictures from inside the polling booth showing the EVM. pic.twitter.com/5bv9ZR5tIn
ఓటు హక్కు వినియోగించుకున్న మనీష్ తివారీ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ నేత మనీష్ తివారీ లూథియానాలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు వేసే ముందు ప్రజలు వారి ప్రయోజనాలను గుర్తుంచుకోవాలన్నారు. కులం, మతాలకు అతీతంగా ప్రజలు ఎదగాలని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు.
Congress leader Manish Tewari casts his vote in #PunjabElections2022 at Ludhiana
— ANI (@ANI) February 20, 2022
I request people to keep in mind the interests of Punjab, rise above caste & religion while voting in this election, he says. pic.twitter.com/EPlO3B6A2V
ఈవీఎంలో లోపాలు.. ఆప్ నేత రాఘవ్ చద్దా
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, రాష్ట్రంలోని పలు పోలింగ్ బూత్‌ల్లోని ఈవీఎంలలో లోపాలున్నాయని ఆప్ నేత రాఘవ్ చద్దా తెలిపారు. బూత్ కాప్చరింగ్ సైతం జరుగుతోందని ట్విటర్ వేదికగా ఆరోపించారు.
Reports coming in from Guru Har Sahai AC, Booth No. 23. Capturing attempted by SAD workers. They entered booth & are asking polling officers to let their NRI family members to vote (through someone on their behalf) else they won't allow anyone to vote.@ECISVEEP for action pls
— Raghav Chadha (@raghav_chadha) February 20, 2022
కాస్గంజ్లో నిలిచిపోయిన పోలింగ్
యూపీలో మూడో దశలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటింగ్ ప్రారంభం కాగానే కాస్గంజ్లోని ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎంలో సాంకేతిక లోపం కారణంగా పోలింగ్‌ను తాత్కాలింగా నిలిపివేశారు.
వేర్పాటువాదులకు పంజాబ్ ప్రజలు బుద్ది చెబుతారు : సునీల్ జాఖర్
అబోహర్ అసెంబ్లీ నియోజకవర్గం పంజ్కోసిలోని పోలింగ్ బూత్‌లో కాంగ్రెస్ నాయకుడు సునీల్ జాఖర్ ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించి పాలించాలని కలలు కంటున్న వారికి పంజాబ్ ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు.
పంజాబ్‌లో 9 గంటల వరకు 4.8 శాతం
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. కాగా, అక్కడ పోలింగ్ 8 గంటలకే ప్రారంభం కావడంతో 9 గంటల వరకు 4.8 శాతంగా పోలింగ్ మాత్రమే నమోదు అయింది.
యూపీలో 9 గంటల వరకు 8.15 శాతం పోలింగ్
యూపీలో మూడో దశలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, 9 గంటలకు వరకు యూపీలో 8.15 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఓటు వేసిన ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్
పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ బంగారు భవిష్యత్తు కోసం ప్రతీ పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థించారు.
Bhagat Singh and many other people sacrificed their lives for the country. I appeal to the public to vote for the candidate they want: AAP CM candidate Bhagwant Mann pic.twitter.com/Zzqwm3dYrg
— ANI (@ANI) February 20, 2022
ఓటు వేసిన సోనూసూద్ సోదరి
నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్ మోగాలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రాంత బిడ్డగా మోగాను అభివృద్ధివైపు నడిపించే బాధ్యత తనపై ఉందన్నారు. పోలింగ్ బూత్‌లను సందర్శించి ఓటర్లను కలుసుకుంటానని చెప్పారు. ఆమె కాంగ్రెస్ తరపున మోగా నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న సంగతి తెలిసిందే.
సమాజ్‌వాదీ పార్టీ భారీ విజయం సాధిస్తుంది: అభయ్ రామ్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ స్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు అభయ్ రామ్ యాదవ్ ఈ రోజు సైఫాయ్‌లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ఆయన చెప్పారు.
#UttarPradeshElections2022 | Samajwadi Party patron Mulayam Singh Yadav's brother Abhay Ram Yadav cast his vote in Saifai today
— ANI UP/Uttarakhand (@ANINewsUP) Fbruary 20, 2022
Samajwadi Party will witness huge win in this elections, he says. pic.twitter.com/xcy8HkXNua
ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు..
ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'ఈ రోజు పంజాబ్ ఎన్నికలు, యూపీ మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లందరూ.. ప్రత్యేకించి యువత, మొదటిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలి' అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
The Punjab elections and the third phase of the UP elections are being held today. I call upon all those voting today to do so in large numbers, particularly the youth as well as first time voters.
— Narendra Modi (@narendramodi) February 20, 2022
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ప్రత్యేక ప్రార్థనలు చేసిన సీఎం చన్నీ
పంజాబ్ ఎన్నికలకు వెళుతున్న సందర్భంగా, సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఖరార్‌లోని గురుద్వారా శ్రీ కటల్‌గర్ సాహిబ్‌లో ప్రార్థనలు చేశారు. సీఎం చన్నీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో చమ్‌కౌర్ సాహిబ్, బదౌర్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.
సోనూసూద్ సోదరికి మద్దతుగా హర్భజన్ సింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సోనూసూద్ సోదరికి మద్దతుగా వీడియో పోస్ట్ చేశారు. 'నా సోదరుడు సోనూ సూద్ సోదరి మాళవికకు శుభాకాంక్షలు. ఈ కుటుంబం నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. ప్రజలకు సహాయం చేయడానికి దేవుడు వీరికి అపారమైన శక్తిని ఇచ్చాడు. మీరు ప్రజలకు సహాయం చేస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ హర్భజన్ సింగ్ వీడియో పోస్ట్ చేశారు.
పోలింగ్ ప్రారంభం
►యూపీలో 59 స్థానాలకు, పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 8 గంటలకు పోలింగ్ పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
►అవధ్, బుందేల్‌ఖండ్, పశ్చిమ యూపీల్లో బీజేపీ, ఎస్పీ సహా పార్టీలకు కఠిన పరీక్ష
►అఖిలేశ్‌తోపాటు బరిలో 627 మంది అభ్యర్థులు
►తీర్పు ఇవ్వనున్న 2.15 కోట్లకు పైగా ఓటర్లు
►135 మంది అభ్యర్థులపై నేరారోపణలు
పలుచోట్ల చతుర్ముఖ పోటీలు..
రైతు సంఘాలతో ఏర్పడ్డ సంయుక్త్ సమాజ్ మోర్చా వంటివి పోటీని ఆసక్తికరంగా మార్చేశాయి. ఐదుసార్లు సీఎంగా చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ అకాలీదళ్ తరఫున లంబి నుంచి బరిలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి గుర్మీత్‌సింగ్ ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి సొంత పార్టీ పెట్టుకుని బీజేపీతో కలిసి బరిలో దిగిన కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలాలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆప్ అభ్యర్థి కోహ్లీపై ప్రజల్లో మంచి అభిప్రాయముంది. అమృత్సర్ ఈస్ట్‌లో పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూకు అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ మజీతియా గట్టి పోటీ ఇస్తున్నారు. ఆప్ అభ్యర్థి జీవన్‌జోత్ కౌర్ పాపులారిటీ వారిద్దరినీ కలవరపెడుతోంది. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ భదౌడ్, చమ్‌కౌర్ సాహిబ్ స్థానాలు రెండింటి నుంచీ పోటీ చేస్తున్నారు. ఇక ధురిలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ బరిలో ఉన్నారు. రాయ్ సిక్కుల ప్రాబల్యముండే జలాలాబాద్‌లో అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ బాదల్ బరిలో ఉన్నారు. మాజీ సీఎం రాజీందర్ కౌర్ భట్టాల్, పంజాబ్ బీజేపీ చీఫ్ అశ్వనీ శర్మ, కేంద్ర మాజీ మంత్రి విజయ్‌సంప్లా తదితర ప్రముఖులు కూడా పోటీలో ఉన్నారు.
పంజాబ్‌లో నేడే పోలింగ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకూ ఆదివారం ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. 2017లో రాష్ట్రంలో కాంగ్రెస్ 77 సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. పదేళ్లు పాలించిన అకాలీ–బీజేపీ కూటమి 18 సీట్లతో చతికిలపడగా తొలిసారి రాష్ట్ర ఎన్నికల బరిలోకి దిగిన ఆప్ 20 సీట్లతో సత్తా చాటింది. ఈసారి ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్‌తో పాటు అకాలీదళ్–బీఎస్పీ కూటమి, బీజేపీ–పీఎల్సీ కూటమి, ఆప్ అన్ని రకాలుగా ప్రయత్నించాయి.
అక్కడ ‘వికాస్’ భయం లేదిక
కాన్పూర్ జిల్లాలో బిల్హౌర్ అసెంబ్లీ స్థానం పరిధిలో కనీసం 40 వేల మంది బహుశా గత రెండు దశాబ్దాల్లో తొలిసారి స్వేచ్ఛగా ఓటేయనున్నారు. వారికి ‘వికాస్’ భయం లేకుండా పోయింది మరి. కరడుగట్టిన మాఫియా లీడర్ అయిన వికాస్ దూబే అంటే ఇటీవలి దాకా ఇక్కడందరికీ హడలే. తను చెప్పిందే వేదంగా చలామణి అవుతూ వచ్చింది. రాజకీయ నాయకుల నుంచి ప్రభుత్వాధికారుల దాకా అంతా పూర్తిగా వికాస్ చెప్పుచేతల్లో ఉండేవారని చెబుతారు.దాంతో బిక్రూ, 12 పరిసర గ్రామాల వాళ్లు అతను చెప్పిన వారికే ఓటేయాల్సి వచ్చేది.
ఎన్నికలొచ్చాయంటే అభ్యర్థులు వికాస్ ఇంటిముందు బారులు తీరేవారు. అతని అనుగ్రహం దక్కిన వారికి ప్రచారంతో పని లేకుండా ఓట్ల పంట పండేది. 2020 జూలై 3న ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను వికాస్ గ్యాంగ్ అత్యంత కిరాతకంగా పొట్టన పెట్టుకుంది. అందుకు ప్రతీకారంగా 10వ తేదీన పోలీసులు వికాస్‌ను ఎన్కౌంటర్ చేశారు. దాంతో ఈసారి అభివృద్ధి, శాంతిభద్రతలు, స్థానికాంశాలే ప్రాతిపదికగా తమకు నచ్చిన వాళ్లకు ఓటేస్తామంటూ స్థానికులు సంబరపడుతున్నారు. 2017లో ఇక్కడ బీజేపీ నెగ్గింది.
వికాస్‌తో పాటు అతని గ్యాంగ్‌లో చాలామంది బ్రాహ్మణులే కావడంతో యోగి ప్రభుత్వం బ్రాహ్మణులను ఏరికోరి ఊచకోత కోస్తోందని ఆరోపిస్తున్న వారు కూడా ఉన్నారు. ఈసారి ఇక్కడి బ్రాహ్మణులు బీజేపీకి ఓటేయబోరనేది వారి వాదన. కానీ మరికొందరు దీన్ని కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వం నేరగాళ్లను ఏరిపారేసిందే తప్ప వారి కులాన్ని చూడలేదని వారంటున్నారు.
22% కళంకితులే...
యూపీలో మూడో దశ పోలింగ్ బరిలో ఉన్న 627 మంది అభ్యర్థుల్లో 135 మంది (22%) నేరచరితులే. ఈ జాబితాలో వరుసగా మూడో దశలోనూ సమాజ్‌వాదీయే ముందుంది. ఈ దశలో ఏకంగా 52 శాతం మంది నేర చరితులకు ఎస్పీ టికెట్లిచ్చింది. బీజేపీ నుంచి 46 % మంది అభ్యర్థులపై కేసులున్నాయి. 39%తో బీఎస్పీ మూడో స్థానంలో, 36%తో కాంగ్రెస్ నాలుగు, 22%తో ఆప్ ఐదో స్థానంలో ఉన్నాయి. నేర చరితుల్లో ఇద్దరు అత్యాచారం కేసులను ఎదుర్కొంటుండగా 11 మందిపై మహిళలపై వేధింపులు, హింస ఆరోపణలున్నాయి. ఇద్దరిపై హత్య, 18 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి. మొత్తం 59 స్థానాలకు 26 చోట్ల ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులుండటంతో వాటిని రెడ్ అలర్ట్ జోన్లో చేర్చారు.
బరిలో ఉన్న మంత్రులు
అసీం అరుణ్, సతీశ్ మహానా, రాం నరేశ్ అగ్నిహోత్రి, మనోహర్‌లాల్ మన్ను కోరి, లఖన్సింగ్ రాజ్‌పుత్, నీలిమా కటియార్, అజిత్ సింగ్ పాల్.
కీలక అభ్యర్థులు
అఖిలేశ్ యాదవ్, ఎస్పీ సింగ్ భాగెల్, శివపాల్ సింగ్ యాదవ్, రాంవీర్ ఉపాధ్యాయ, లౌసీ ఖుర్షీద్
బుందేల్‌ఖండ్‌లో బీజేపీకి పరీక్ష
బుందేల్‌ఖండ్‌లో మూడో దశలో పోలింగ్ జరుగుతున్న 5 జిల్లాల్లోని 13 అసెంబ్లీ స్థానాలను 2017లో బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేయడం ఆ పార్టీకి సవాలే. అందుకే ఈ ప్రాంతంలో బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా ప్రముఖులు 31 బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించారు. యోగి ఐదు జిల్లాల్లో కేవలం 28 గంటల్లో 8 బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
ఎస్పీ, కాంగ్రెస్ చెరో ర్యాలీలు చేయగా బీఎస్పీ చీఫ్ మాయావతి ఒకే ర్యాలీతో సరిపెట్టారు. లలిత్పూర్, మెహ్రౌనీ, మధోగఢ్, కల్పి, మహోబాల్లో ఈసారి ముక్కోణపు పోటీ నెలకొంది. జలౌన్‌లోని ఒరై అసెంబ్లీ స్థానంలో మాజీ ఎంపీ బ్రిజ్‌లాల్ ఖబ్రీ రెండో భార్య ఊర్మిళ సోంకర్ ఖబ్రీ కాంగ్రెస్ టికెట్‌పై బరిలో దిగుతున్నారు. ఖబ్రీ మొదటి భార్య సోదరుడు సతేంద్ర సింగ్ అలియాస్ శ్రీపాల్ బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గౌరీశంకర్ వర్మ, ఎస్పీ నుంచి గతంలో మూడుసార్లు గెలిచిన మాజీ మంత్రి దయాశంకర్ వర్మ బరిలో నిలిచారు. మంత్రి మనోహర్‌లాల్ పంత్ అలియాస్ మన్ను కోరి తదితరులు ఈ దశలో బరిలో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల బరిలో ఇదే తొలిసారి
అఖిలేశ్ స్వయంగా పార్టీ కంచుకోట కర్హాల్ నుంచి బరిలో దిగారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగడం ఇదే తొలిసారి. దాంతో బీజేపీ ఇక్కడ కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్‌ను బరిలోకి దింపింది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో ఖాతా తెరవని బీఎస్పీ ఈసారి ఎస్సీ ఓటర్లు అధికంగా స్థానాల్లో త్రిముఖ పోటీని అనివార్యం చేసింది. మెయిన్‌పురి, ఇటావా సహా 8 జిల్లాలు ములాయం కుటుంబానికి కంచుకోటలు. శివపాల్ యాదవ్ పోటీ చేస్తున్న జస్వంత్‌నగర్ స్థానమూ అంతే. ఇక్కడినుంచి 1985 నుంచి 1993 దాకా ములాయం వరుసగా నాలుగుసార్లు గెలిచారు. 1996 నుంచి 2017 దాకా ఆయన తమ్ముడు శివపాల్ వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు.
ఆసక్తికరంగా అవధ్, పశ్చిమ యూపీ
మొదటి రెండు దశల్లో జాట్ ఆధిపత్యమున్న పశ్చిమ యూపీ జిల్లాల్లో ఓటింగ్ సరళి తమకు అంత అనుకూలంగా లేదన్న అభిప్రాయం బీజేపీలో కనిపిస్తోంది. మూడో దశలో పశ్చిమ యూపీలోని ఫిరోజాబాద్, ఎటా, కాస్గంజ్, మెయిన్‌పురి, హత్రాస్ జిల్లాల్లో, అవధ్లోని కాన్పూర్, కాన్పూర్ దేహత్, ఔరియా, కన్నౌజ్, ఇటావా, ఫరూఖాబాద్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. వీటిలో యాదవులు, ఎస్సీలు, ముస్లింలు గణనీయంగా ఉన్నారు. దాంతో యాదవులు, ముస్లింల మద్దతుపై అఖిలేశ్ భారీ ఆశలు పెట్టుకున్నారు.
మూడో దశలో అఖిలేశ్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు
2017 ఎన్నికల్లో ఈ యాదవ బెల్ట్‌లో కోల్పోయిన పట్టును ఈసారి సాధించాలని సమాజ్‌వాదీ ప్రయత్నిస్తోంది. పోయినసారి ఏకంగా 49 సీట్లు నెగ్గిన బీజేపీ అవే ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. 2012 ఎన్నికల్లో 37 స్థానాల్లో గెలిచిన ఎస్పీ ఈసారి ఆ తరహా ఫలితాలు ఖాయమని నమ్ముతోంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆయన శివపాల్ సింగ్ యాదవ్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఈ దశలో బరిలో ఉన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం ఆరింటి దాకా పోలింగ్ జరగనుంది.
మూడో దశ పోలింగ్‌కు రంగం సిద్ధం..
ఉత్తర్రపదేశ్‌లో కీలకమైన మూడో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. బుందేల్‌ఖండ్, అవధ్, పశ్చిమ యూపీల్లోని 16 జిల్లాల పరిధిలో 59 అసెంబ్లీ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. అన్ని పార్టీల నుంచి 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 96 మంది మహిళలు. 2.15 కోట్ల ఓటర్లు వీరి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. హత్రాస్, ఫిరోజాబాద్, ఇటావా, కాస్గంజ్, మెయిన్‌పురి, ఫరూకాబాద్, కనౌజ్, ఇటావా, ఔరైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్పూర్, హమీర్పూర్, మహోబా జిల్లాల్లో పోలింగ్ జరగనుంది.
Related News By Category
Related News By Tags
-
యూపీలో అయిదో దశ పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
Live Blog: ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
సోనియా గాంధీ కీలక నిర్ణయం.. పీసీసీ చీఫ్‌లకు షాక్!
ఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడటంతో కాంగ్రెస్ హైకమాండ్ ప్రక్షాళన చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లుగా ఉన్నవారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే ...
-
ఉత్తర్ ప్రదేశ్ చివరి దశ ఎన్నికల పోలింగ్
-
కులం, మతం పేరుతో ఇంకెన్ని రోజులు రెచ్చగొడతారు.. ప్రియాంక ఫైర్
లక్నో: యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్...
Comments
Please login to add a commentAdd a comment