Third phase polling
-
Lok Sabha Election 2024: నేడే మూడో దశ పోలింగ్
అహ్మదాబాద్/బెంగళూరు: పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.బరిలో అగ్రనేతలు, ప్రముఖులుకేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా), మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్‌సింగ్(రాజ్‌గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.283 చోట్ల పోలింగ్ పూర్తిఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.రాష్ట్రం సీట్లుగుజరాత్ 25కర్ణాటక 14మహారాష్ట్ర 11ఉత్తరప్రదేశ్ 10మధ్యప్రదేశ్ 9ఛత్తీస్‌గఢ్ 7బిహార్ 5అస్సాం 4బెంగాల్ 4గోవా 2దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 2 -
Assembly Election 2022: ముగిసిన యూపీ మూడో దశ పోలింగ్
-
సొంతపిచ్‌పై...అఖిలేశ్‌కు అగ్నిపరీక్ష!
ఉత్తరప్రదేశ్ మొదటిదశ ఎన్నికల్లో జాట్లు కీలకంగా మారగా.. రెండోదశలో (ఫిబ్రవరి 14న పోలింగ్ జరిగింది) ముస్లిం ఆధిపత్య ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఈనెల 20న మూడోదశ పోలింగ్ యాదవుల బెల్ట్‌లో జరుగుతోంది. మూడు ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 16 జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో యాదవ సామాజికవర్గ బలమెక్కువ. సమాజ్‌వాది (ఎస్పీ)కి దీన్ని కంచుకోటగా అభివర్ణిస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీకి తలబొప్పి కట్టింది. అఖిలేశ్‌పై తిరుగుబాటు చేసి సొంతకుంపటి పెట్టుకున్న బాబాయి శివపాల్ సింగ్ యాదవ్‌తో ఇటీవలే సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకున్నప్పటికీ ఎస్పీ అధినేతకు మూడోదశ విషమపరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలోని కర్హల్ నుంచే అఖిలేశ్ స్వయంగా బరిలో నిలిచారు. బాబాయ్‌తో సయోధ్యతో పూర్వవైభవంపై ఆశలు పశ్చిమ యూపీలోని..ఐదు జిల్లాలు, అవధ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలు, బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని ఐదు సీట్లకు ఫిబ్రవరి 20న మూడోదశ పోలింగ్ జరగనుంది. ఫిరోజాబాద్,, కాస్గంజ్, ఎతాహ్, మెయిన్‌పురి,, ఫరూకాబాద్,, కన్నౌజ్, ఔరాయా జిల్లాలు 2017లో అఖిలేశ్ పార్టీకి ఓటువేయలేదు.ఫలితంగా ఐదేళ్ల కిందట మొత్తం 59 సీట్లలో బీజేపీ ఏకంగా 49 తమ ఖాతాలో వేసేసుకుంది. సమాజ్‌వాది పార్టీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎస్పీ అధినేత కుటుంబకలహాలు పార్టీ విజయావకాశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉన్నప్పటికీ అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి ఓటమి పాలయ్యారు. అంతకుముందు 2012లో ఈ 59 సీట్లలో (20న పోలింగ్ జరిగే స్థానాలు) ఎస్పీ 37 చోట్ల నెగ్గడం గమనార్హం.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ బెల్ట్‌లో ఎస్పీ విజయావకావలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో అఖిలేశ్ తన శివపాల్ యాదవ్‌ను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. గతంలో హథ్రాస్ గ్యాంగ్‌రేప్ ఘటన కూడా ఈ ప్రాంతంలోనే జరిగింది. దీని నుంచి లబ్ధి పొందాలని చూస్తున్న ఎస్పీ అధినేత ఎన్నికల ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రతినెలా ‘హథ్రాస్ కి బేటి స్మృతి దివస్’ను నిర్వహిస్తున్నారు. బుందేల్‌ఖండ్ బాగా వెనుకబడిన ప్రాంతం కావడతో నిరుద్యోగ సమస్య, నీటి ఎద్దటి తదిదర సమస్యలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని.. ఎస్పీ అధికారంలోకి వస్తే ఉచిత రేషన్, నెలకు కిలో నెయ్యిని అందిస్తామని అఖిలేశ్ ఓటర్లుకు హామీ ఇచ్చారు. ఒకప్పుడు బుందేల్‌ఖండ్ బీఎస్పీకి కంచుకోటగా ఉండేది. కానీ 2017లో వీచిన బీజేపీ గాలితో బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయింది. హైటెన్షన్ పోరు కర్హాల్ నియోజకవర్గంలో అఖిలేశ్‌కు పోటీగా ఓబీసీ నాయకుడు, కేంద్ర మంత్రి సత్యపాల్‌సింగ్ బఘేల్‌ను బీజేపీ బరిలోకి దింపింది. ఈ స్థానంలో మొత్తం ఓటర్లలో 38 శాతం మంది యాదవులే. తర్వాతి స్థానంలో క్షత్రియులు ఉంటారు. భోగావ్ నియోజకవర్గంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి రామ్‌నరేశ్ అగ్నిహోత్రికే బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. కాన్పూర్ నగర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి సతీష్ మహానాను బీజేపీ మరోసారి రంగంలోకి దిగింది. తొలిదశ ఎన్నికలు పశ్చిమ యూపీలో జరిగినందువల్ల తమకు అనుకూలత ఉందని భావిస్తున్న అఖిలేశ్ యాదవ్ మూడోదశలో ఎలాగైనా పైచేయి సాధించాలనే పట్టుదలతో పని చేస్తోంది.దీంట్లో పైచేయి సాధిస్తే మిగతా నాలుగు దశల్లో కొంత ప్రశాంతంగా పనిచేసుకోవచ్చని ఎస్పీ భావిస్తోంది. యోగి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కుల, సంకుచిత, నియంతృత్వ పాలనకు ముగింపు పల కండి. సమాజంలోని అన్ని వర్గాలను సమదృష్టితో చూసే బహుజన సమాజ్ పార్టీకే పట్టంకట్టండి. దోపిడీదారుల అరాచకాలతో గతంలో యూపీ ప్రాంత ప్రజలు అవస్థలు పడ్డారు. మా పాలనలో వీరందరినీ ఏరిపారేశాం. ఎస్పీ పాలనలో రాష్ట్రంలో కేవలం ఒక వర్గం వారే అభివృద్ధి ఫలాలను అందుకున్నారు. మా ప్రభుత్వం వెనకబడిన కులాల అభివృద్ధి కోసం ఎంతగానో శ్రమించింది. మిగతా పార్టీల్లా మేం నెరవేర్చని వాగ్దానాలు చేయబోం. అందుకే ఈసారి ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదలచేయలేదు. – బీఎస్పీ చీఫ్ మాయావతి అఖిలేశ్ గెలుపు ఖాయమని మొదట్లో అతి విశ్వాసంతో ఉన్నారు. తాను పోటీ చేస్తున్న కర్హాల్ నియోజకవర్గంలో స్వయంగా ప్రచారం చేయా ల్సిన పనే లేదని, నేరుగా ఫలితాలు వెలువడే రోజు(మార్చి పదో తేదీ)న కర్హాల్ వస్తానని అఖిలేశ్ ధీమా వ్యక్తంచేశారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్వయంగా ములాయం సింగ్‌తో ముందే ప్రచారం చేయిస్తున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈసారి ఎన్నికల్లో 300 సీట్లు సాధించి బీజేపీ ఘన విజయం సాధించాలని ఓటర్లు ఆకాంక్షిస్తే.. ఈ గెలుపు పరంపర కర్హాల్ నుంచే మొదలవ్వాలి. – హోం మంత్రి అమిత్ షా – నేషనల్ డెస్క్, సాక్షి -
ఏపీలో మూడో దశ పంచాయతీ పోలింగ్ ప్రారంభం
-
ప్రారంభమైన మూడో దశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
మధ్యాహ్నం 4.00 మూడో విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2,639 సర్పంచ్, 19,553 వార్డులలో ఓట్ల లెక్కింపు మొదలైంది. మధ్యాహ్నం 3.30 మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, ప్రకాశం 79.31, నెల్లూరు 79.63, చిత్తూరు 77.31, కడప 68.42, కర్నూలు 79.90, అనంతపురం 78.32 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3:00 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జమిగూడ, బొంగరం, లింగేటి తదితర పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 2:30 పంచాయతీ ఎన్నికల్లో అపశ్రుతి పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముంచంగిపుట్టు మండలం వుబ్బంగి నుంచి లక్ష్మీపురం వెళ్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ఓటర్లకు గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అరకులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ మాధవి కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే ఫాల్గుణ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2:00 రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటలకే పోలింగ్ ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పరిధిలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మధ్యాహ్నం. 1.30 రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. మధ్యాహ్నం. 1.00 మధ్యాహ్నం 12.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ 66.48 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ► శ్రీకాకుళం- 64.14 శాతం ►విజయనగరం- 78.5శాతం ►విశాఖపట్నం- 63.23శాతం ►తూర్పు గోదావరి- 67.14శాతం ►పశ్చిమ గోదావరి- 53.51శాతం ►కృష్ణా- 65.88 శాతం ►గుంటూరు- 71.67 శాతం ►ప్రకాశం- 69.95శాతం ►నెల్లూరు- 69.82 శాతం ►చిత్తూరు- 64.82 శాతం ►కడప- 57.34 శాతం ►ర్నూలు- 71 .96 శాతం ►అనంతపురం- 70.23 శాతం మధ్యాహ్నం 12.30 విశాఖపట్నం: జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజి పోలింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం 12.00 ►అనంతపురం డివిజన్లోని 19మండలాల్లో మూడవ విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల వరకు 61.25 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ►తూర్పుగోదావరి: రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం పుల్లంగి, బొడ్లంక పంచాయతీ గ్రామాల్లో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి పరిశీలించారు. ఉదయం. 11.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ సజావుగా కొనసాగుతోంది. ఓటు వేయడానికి పలు గ్రామాల్లో ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఉదయం 11.00 ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. జిల్లాల వారిగా నమోదైన పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 42.65 శాతం ►విజయనగరం- 50.7 శాతం ►విశాఖపట్నం- 43.35 శాతం ►తూర్పు గోదావరి- 33.52 శాతం ►పశ్చిమ గోదావరి- 32 శాతం ►కృష్ణా- 38.35 శాతం ►గుంటూరు 45.90 శాతం ►ప్రకాశం 35.90 శాతం ►నెల్లూరు 42.16 శాతం ►చిత్తూరు 30.59 శాతం ►వైఎస్ఆర్ కడప 31.73 శాతం ►కర్నూలు 48.72 శాతం0 ►అనంతపురం 48.15 శాతం ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉదయం. 10.30 ►గుంటూరు: గురజాల మండలం మాడుగులలో పోలింగ్‌ను అధికారులు నిలిపివేశారు. అభ్యర్థుల గుర్తులు తారుమారు కావటంతో 12, 13 వార్డుల్లో పోలింగ్ నిలిపివేసినట్లు వెల్లడించారు. ఈనెల 21న రెండు వార్డులకూ ఎలక్షన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ►అనంతపురం: ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని తోపుదుర్తి గ్రామంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోలింగ్ కేంద్రాల వద్ద మానవతా దృక్పథంతో వ్యవహరించేలా ఆదేశాలు ఇచ్చామని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు దగ్గరుండి సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మూడో విడతలో 168 కేంద్రాలను సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించామని, పోలింగ్ తర్వాత ఎవరైనా కక్ష సాధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఉదయం 10.00 ►విశాఖపట్నం: పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వెన్నలపాలంలో అరకు వైస్సార్సీపీ ఎంపీ గొట్టేటి మాధవి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►అనంతపురం: ఉరవకొండ మండలం రాకెట్లలో వైస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా జిల్లాలో ఉదయం 9.30 గంటల వరకు 32.21 శాతం పోలింగ్నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. ఉదయం. 9.30 పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8:30 గంటల వరకు జిల్లాల వారిగా పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి. ►శ్రీకాకుళం- 12.87 శాతం ►విజయనగరం- 15.3 శాతం ►విశాఖపట్నం- 13.75 శాతం ►తూర్పు గోదావరి- 12.6 శాతం ►పశ్చిమ గోదావరి- 11.72 శాతం ►కృష్ణా - 8.14 శాతం ►గుంటూరు 18.83 శాతం ►ప్రకాశం 8.04 శాతం ►నెల్లూరు 9.1 శాతం ►చిత్తూరు 9.34 శాతం ►వైఎస్ఆర్ కడప 7.5 శాతం ►కర్నూలు 15.39 శాతం ►అనంతపురం 9.9 శాతం ఉదయం. 9.00 ►రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడవ విడత పంచాయితీ ఎన్నికల పోల్ శాతం 8.30 గంటల వరకు 11.74 శాతంగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ►రాష్ట్రంలోని పలు పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని పాత ముచ్చుమర్రి, కొత్త ముచ్చుమర్రి గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పోలింగ్ బూత్‌లకు వెళ్లి గ్రామ ప్రజలు ఓటు వేశారు. ఇన్ని సంవత్సరాలు తర్వాత ఓటు వేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం. 8.30 ►వైఎస్సార్ కడపలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8.30 గంటల వరకు జిల్లాలో 7.57 పోలింగ్ శాతం నమోదనట్లు అధికారులు పేర్కొన్నారు. ►విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొంటున్నారు. ఉదయం 7.30 గంటల వరకు 8.7 పోలింగ్ శాతం నమోదైనట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియను ఆయన కంట్రోల్ రూమ్ నుంచి ఆరా తీస్తున్నారు. ఉదయం.8.00 రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ప్రశాంతగా సాగుతోంది. మచిలీపట్నం నియజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆర్డీవో ఖాజావలి పోలింగ్ పక్రియను పరిశీలిస్తున్నారు. అదే విధంగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని సమస్యాత్మకమైన పోలింగ్ బూతులను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు పరిశీలిస్తున్నారు. ఉదయం. 7.30 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. అదే విధంగా 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం. 7.02 పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేసి తమ పనులు చేసుకునేందుకు ఉదయాన్నే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కరోనా నిబంధనలు పాటిస్తూ ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 6.30 ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల మూడో విడత పోలింగ్ బుధవారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం. 6.25 సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో మూడో విడత పోలింగ్ ఉదయం 6.30 గంటలకు మొదలు కానుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. 7,757 మంది పోటీ: 2,639 సర్పంచ్ పదవులకు మరి కాసేపట్లో ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. సాక్షి, అమరావతి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరగనుంది. పోటీలో ఉన్న 51,369 మంది అభ్యర్థుల భవితవ్యం అదేరోజు తేలిపోనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 6.30 గంటలకు పోలింగ్ మొదలు కానుండగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మూడో విడతలో 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిపేందుకు నోటిఫికేషన్ జారీ కాగా, అందులో 579 సర్పంచ్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. ఇక విశాఖ జిల్లా పెదబయలు మండలం గిన్నెలకోట, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీ పేట, ప్రకాశం జిల్లా కందుకూరు మండలం నర్రిశెట్టివారి పాలెం గ్రామ పంచాయతీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఆ మూడు చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మిగిలిన 2,639 సర్పంచ్ పదవులకు బుధవారం ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు 7,757 మంది పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది పోటీలో ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 1,977 పోలింగ్ కేంద్రాలు మూడో విడతలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరగనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. అదేవిధంగా మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఆ 7,245 కేంద్రాలలో పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెబ్ కెమెరాల ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ ప్రక్రియలో 76,019 మంది సిబ్బంది పాల్గొంటుండగా, 4,780 మంది పోలింగ్ పర్యవేక్షణ విధులలో పాల్గొననున్నారు. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓటర్లను పోలింగ్ ప్రక్రియ ముగిసే చివరి గంటలో ఓటింగ్‌కు అనుమతించనున్నట్టు ద్వివేది తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో 63,270 మంది పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోనే కేవలం అరగంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు. మొదట ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరిగిన వార్డుల ఓట్ల లెక్కింపును చేపట్టి, ఆ తర్వాత సర్పంచ్ పదవి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఈ ప్రక్రియలో 63,270 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. -
చివరి దశ ఎన్నికల్లో 57.92% పోలింగ్
బిహార్ శాసనసభకు జరిగిన మూడో దశ(చివరి దశ) ఎన్నికల్లో 57.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొదటి రెండు దశల కంటే మూడో దశలో అధికంగా పోలింగ్ జరిగిందని తెలిపింది. చెదురుమదురు సంఘటనలు మినహా శనివారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చివరి దశలో ఉత్తర బిహార్‌లో 15 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 78 నియోజకవర్గాల్లో 2.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 33,782 పోలింగ్ కేంద్రాల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్ణియాలో ఓటింగ్ కేంద్రం వద్ద ఉన్న గుమికూడిన జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. కతిహర్‌లో రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయనందుకు నిరసనగా 12 బూత్‌లతో జనం ఓటింగ్‌ను బహిష్కరించారు. జోకిహత్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆర్జేడీ అభ్యర్థి సర్ఫరాజ్ అలామ్ తన చొక్కాకు పార్టీ బ్యాడ్జీని ధరించి ఓటు వేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబర్ 10న జరగనుంది. శనివారం జరిగిన పోలింగ్తోపాటు తొలి రెండు పోలింగ్ శాతాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 56.43 శాతం పోలింగ్ నమోదైంది. -
బిహార్‌లో ముగిసిన 3వదశ పోలింగ్
-
బిహార్‌లో ముగిసిన 3వదశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 5 గంటల వరకూ 53.24 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. 78 నియోజకవర్గాల్లో 1,204 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు సిద్ధమయ్యారు. ఇక నేడు బరిలో దిగిన వారిలో అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. ఈనెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగతుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. ఉదయం 9 గంటల వరకు 7.6 శాతం పోలింగ్ నమోదు మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్ పూర్తి మొత్తం 1,23,799 మంది పురుషులు, 12,06,378 మంది మహిళల ఓటర్లు నువ్వా నేనా అన్న రీతిలో ఎన్డీఏ- మహాకూటమి మధ్య కొనసాగుతున్న బీహార్ ఎన్నికల సమరం తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం నితీష్ కుమార్ ఎన్నికల బరిలో జేడీయూ తరఫున అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌధరీ, పన్నెండు మంది మూడో దశలో మజ్లిస్ ప్రభావం కోసి-సీమాంచల్ ప్రాంతంలో భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు పలువురు అభ్యర్థులను నిలిపిన మజ్లిస్ పార్టీ -
నేడే బిహార్‌లో తుది విడత పోలింగ్
పట్నా: బిహార్‌లో తుది విడత ఎన్నికలకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 15 జిల్లాల్లోని 78 స్థానాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. మొత్తం 1,204 మంది అభ్యర్థులు బరిలో ఉంటే, దాదాపుగా 2.34 కోట్ల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. 78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మూడో విడత కీలకంగా ఒవైసీ ఈ విడత జరిగే ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. ఎన్డీయే, మహాఘట్బంధన్, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీతో పాటుగా అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం, మాయావతికి చెందిన బీఎస్పీ, ఉపేంద్ర కుష్వా ఆర్ఎల్ఎస్పీ కూడా కొన్ని నియోజకవర్గాల్లో తమ పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కోసి–సీమాంచల్ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లోనే తుది విడత ఎన్నికలు జరగనున్నాయి. ప్రతీ ఏడాది వరదలతో అతలాకుతలమవుతూ సారో ఆఫ్ బిహార్‌గా పేరు పడిన కోసి ప్రాంతంలో ముస్లింలు, యాదవులు, అత్యంత వెనుకబడిన వర్గాల కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. సీమాంచల్ ప్రాంతంలో 30% జనాభా ముస్లింలే. దీంతో ఎంఐఎం అధ్యక్షుడు ఒవైసీ చాలా సీట్లలో తమ అభ్యర్థులను నిలబెట్టారు. ఆయన ఉధృతంగా ప్రచారాన్ని కూడా నిర్వహించారు. అత్యధిక నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ నెలకొని ఉండడంతో ఎలాగైనా పట్టు సాధించడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈసారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతీ ర్యాలీలోనూ బిహార్ అభివృద్ధి చెందాలంటే నితీశ్ కుమార్ సీఎం కావాలని ఆయన పేరే జపించారు. బిహార్ రాష్ట్ర భవితవ్యాన్ని తేల్చే ఈ ఎన్నికల్లో ఓటరు దేవుడు ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. -
జార్ఖండ్ మూడో దశలో 62 శాతం పోలింగ్
రాంచి: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో దశ పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది జిల్లాల్లో 17 సీట్లకు జరుగుతోన్న ఈ ఎన్నికల్లో 56 లక్షల మంది (62.6 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే వెల్లడించారు. వీరిలో 26 లక్షల మంది మహిళలు, 86 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని తెలిపారు. పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాంచి, హటియా, కాంకే, బర్ఖాతా, రామ్‌గర్‌లలో సాయంత్రం 5 గంటల వరకు.. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరిగింది. -
ముగిసిన మూడో విడత పోలింగ్
న్యూఢిల్లీ: మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. అయితే ఆరు గంటల వరకు క్యూ లైన్లలో ఉన్న వారందరికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహ.. 14 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ నాలుగు గంటలకే ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 61.31 శాతం పోలింగ్ నమైదయింది.116 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈసీ మొత్తం 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. నేడు జరిగిన పోలింగ్‌లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రదల భవిత్యం ఈవీఎంలలో నిక్షిప్తం అయింది. ప్రధాని నరేంద్ర మోదీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, సామాజిక కార్యకర్త అన్నాహజారే, ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్ర 5 గంటల వరకు రాష్ట్రాల వారీగా పోలింగ్.. అస్సాం- 74.05 శాతం బిహార్- 54.95 శాతం ఛత్తీస్‌గఢ్- 64.03 శాతం గోవా- 70.96 శాతం గుజరాత్- 58.81 శాతం జమ్మూ కశ్మీర్- 12.46 శాతం కర్ణాటక- 60.87 శాతం కేరళ- 68.62 శాతం మహారాష్ట్ర- 55.05 శాతం ఒడిశా- 57.84 శాతం త్రిపుర- 71.13 శాతం ఉత్తరప్రదేశ్- 56.36 శాతం పశ్చిమ బెంగాల్- 78.94 శాతం దాద్రానగర్ హవేలీ- 71.43 శాతం డామన్డయ్యూ- 65.34 శాతం -
ఎన్నికల అప్డేట్స్: పూణెలో ఓటేసిన రేణూదేశాయ్
► మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు వరకు 61.31 శాతం పోలింగ్ నమైదయింది. ► మహారాష్ట్రలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో మూడోదశలో పోలింగ్ జరిగింది. ఓటర్లు ఉత్సాహంగా తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రముఖ నటి రేణూదేశాయ్ పూణెలోని ఖోత్రోడ్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ► ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్ర బారామతిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ► పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముర్షీదాబాద్ రానీనగర్ ప్రాంతంలోని 27, 28 నంబర్ పోలింగ్ బూత్‌ల సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. ► మధ్యాహ్నం మూడు గంటల వరకు అస్సాంలో 62.13 శాతం, బిహార్‌లో 46.94 శాతం, గోవాలో 58.55 శాతం, గుజరాత్లో 50.36 శాతం, కశ్మీర్లో 10.64 శాతం, కర్ణాటకలో 49.96 శాతం, కేరళలో 55.05 శాతం, మహారాష్ట్రలో 44.70 శాతం, ఒడిశాలో 46.70, త్రిపూరలో 61.38 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 46.99 శాతం, పశ్చిమ బెంగాల్లో 67.52 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 55.29 శాతం, దాద్రానగర్ హవేలీలో 56.81 శాతం, డామన్ అండ్ డయ్యూలో 55.02 శాతం పోలింగ్ నమోదైంది. ► ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ గుజరాత్‌లోని ఉంజా పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మోదీ దేశానికి ఎంతో చేశారని.. ఇంకెంతో చేస్తారని అన్నారు. ► ఒడిశాలోని దెంకనల్‌లో పోలింగ్ విధులు నిర్వహిస్తున్న అధికారి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోపే తుదిశ్వాస విడిచారు. ► కేరళ లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓటర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో మణి అనే వ్యక్తి చనిపోయాడు. మరోవైపు రెండు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న ఇద్దరు వృద్ధులు చనిపోయారు. తలిపరంబాలో పోలింగ్ కేంద్రం నుంచి ఇంటికి చేరుకున్న 72 ఏళ్ల వేణుగోపాల మరార్ అస్వస్థతకు లోనై మరణించారు. ► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్సాంలోని దిస్పూర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► పశ్చిమ బెంగాల్ ముర్షీదాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన పియార్యుల్ అనే ఓటర్ మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ► బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ అహ్మదాబాద్‌లోని షాపూర్ హిందీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ► ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►పోలింగ్ బూత్‌లోకి అనుకోని అతిథి వచ్చింది. కేరళలో కన్నూర్ జిల్లాలో ఓ పోలింగ్ బూత్‌లో అకస్మాత్తుగా ఓ పాము దర్శనమిచ్చింది. దీంతో అక్కడి ఓటర్లు, అధికారులు భయాందోళనలకు గురయ్యారు. పామును పట్టుకున్న తరువాత పోలింగ్ సజావుగా సాగుతోంది. ►సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సైఫైలోని పోలింగ్‌బూత్‌లో వారు ఓటు వేశారు. భారత క్రికెటర్ చతేశ్వర పుజారా రాజ్‌కోట్‌లో ఓటు వేశారు. ►ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేశ్ బగేల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలే నిజమైన న్యాయనిర్ణేతలని, వారికి చెప్పాల్సింది చెప్పామని ప్రస్తుతం ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ►ఉదయం 11 గంటలకు వరకు నమోదైన పోలింగ్‌లో పశ్చిమ బెంగాల్(23.85) మొదటి స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ వివరాలు (శాతాల్లో).. బీహార్ 20.80, గుజరాత్ 13.24, జమ్మూ కాశ్మీర్ 3.39, కర్ణాటక 12.72, కేరళ 21.09, మహారాష్ట్ర 9.03, ఒడిశా 8.67, త్రిపుర 15.28, ఉత్తరప్రదేశ్ 16.18, ఛత్తీస్‌ఘడ్ 19.31, దాద్రానగర్ హవేలి 11.40, డామన్ డయ్యూ 19.43 ►కాంగ్రెస్ సీనియర్ నేత, గుల్బర్గ ఎంపీ అభ్యర్థి మల్లిఖార్జున ఖర్గే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు హార్థిక్‌పటేల్ ఓటు వేశారు. సురేంద్రనగర్ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మలయాళ సూపర్స్టార్లు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు కూడా ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముట్టి , తిరువనంతపురంలో మోహన్‌లాల్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►సామాజిక కార్యకర్త అన్నాహజారే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మద్ నగర్ జిల్లాలోని రాలేగావ్ సిద్దిలో ఏర్పాటుచేసిన పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. ►వయనాడ్‌లో ఏర్పాటుచేసిన ఓ పోలింగ్ బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెల్లప్పల్లి రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే పోటీచేయడంతో అందరి దృష్టి వయనాడ్‌పై పడింది. ►దేశ వ్యాప్తంగా 14రాష్ట్రాలు, రెండు కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా జరగుతున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు పలు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్ వివరాలు.. బిహార్‌లో 9.35, కర్ణాటకలో 6.02, అసోంలో 12.36, గోవాలో 9.30, గుజరాత్లో 6.76, కేరళలో 6.57, మహారాష్ట్రలో 3.79, ఒడిశాలో 4.98, త్రిపురలో 4.28, యూపీలో 9.80, బెంగాల్లో 16.23, ఛత్తీస్‌ఘడ్‌లో 9.59 శాతం నమోదైంది. ►ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మోదీ అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. రాయిసన్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, సీనియర్ నాయకుడు శశిథరూర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భువనేశ్వర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటును వేశారు. ములాయం సింగ్ సోదరుడు అభయ్ సింగ్ యాదవ్.. మణిపురి నియోజకవర్గంలోని సైఫైలో ఓటు వేశారు. ►బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓటు వేశారు. అహ్మదాబాద్‌లోని నరన్పురా సబ్ జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన తన సతీమణి సొనాల్ షాతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పినరయి గ్రామంలో ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేరళ సీఎం ఓటు వేశారు. ►వికలాంగులు, ముసలివాళ్లు అందరూ పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటుండగా.. నవ వధూవరులు సైతం ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద వీరు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణి అంజలితో కలిసి రాజ్‌కోట్‌లోని అనిల్ జ్ఞాన్ మందిర్ పాఠశాలలో ఓటు వేశారు. కేరళ గవర్నర్ పి. సదాశివం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశాలోని తాల్చేర్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓటు వేశారు. ►గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి సఖాలి నియోజకవర్గంలో ఓటు వేశారు. భువనేశ్వర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అపరాజితా సారంగి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐఆర్సీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ►ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాణిప్ పోలింగ్ కేంద్రంలో క్యూలైనులో నిలబడి ఆయన ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు. కుంభమేళాలో పాల్గొన్నంత ఆనందం కలిగిందన్నారు. భారత ఓటర్లు విజ్ఞత కలవారని ప్రశసించారు. ►కేరళ సీఎం పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కన్నూర్ జిల్లాలోని పినరయిలోని ఆర్సీ అమల బేసిక్ యూపీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో కేరళ సీఎం ఓటు వేసేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. ►ప్రధాని నరేంద్రమోదీ నేడు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాసేపటి క్రితమే గాంధీనగర్‌లోని తన తల్లి ఇంటికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. బీహార్‌లోని సుపాల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని 151 బూత్ నెంబర్లో నిర్వహించిన మాక్‌పోలింగ్‌లో ఈవీఎం మొరాయించడంతో.. ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. ►పశ్చిమ బెంగాల్‌లోని ఓ పోలింగ్ బూత్‌లో ఉదయం నుంచే ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. మహారాష్ట్రలోని ఓ సీనియర్ సిటిజన్ తన ఓటు హక్కును వినియోగించేందుకు వీల్‌చైర్‌పై పోలింగ్ బూత్‌కు వచ్చారు. పుణేలోని మేయర్ కాలనీలోని బూత్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ పెద్దాయనకు సహాయం చేశారు. ఎన్నికల్లో తమకు విజయం చేకూరాలని కర్ణాటక మాజీ సీఎం యాడ్యూరప్ప, బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ పూజలు నిర్వహించారు. షిమోగ జిల్లాలోని శికాయిపురాకు చెందిన హుచార్య దేవాలయాన్ని యాడ్యూరప్ప సందర్శించగా.. కాలాబురాగిలోని శరణ బసవేశ్వరాలయాన్ని బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ►దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. నేడు 14 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుజరాత్(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్(7), ఒడిశా(6), బిహార్ (5), బెంగాల్(5), గోవా(2), దాద్రనగర్ హవేలీ, డామన్డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. -
నేడే మూడో విడత
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మూడో విడత సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమయింది. గుజరాత్, కేరళ సహా 14 రాష్ట్రాల్లోని 116 లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పార్టీల భవితవ్యాన్ని ప్రజలు నేడు తేల్చనున్నారు. గుజరాత్(26), కేరళ(20), అస్సాం(4), కర్ణాటక(14), మహారాష్ట్ర(14) యూపీ(10), చత్తీస్‌గఢ్(7), ఒడిశా(6), బిహార్ (5), బెంగాల్(5), గోవా(2), దాద్రనగర్ హవేలీ, డామన్డయ్యూ, త్రిపురలో చెరో స్థానానికి మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ విడత ఎన్నికలు బీజేపీకి కీలకం కానున్నాయి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఈ 116 స్థానాల్లో 66 సీట్లను కమలనాథులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేవలం 27 సీట్లకే పరిమితమయ్యాయి. ఈ నేపథ్యంలో అదే ఫలితాలను పునరావృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం ఈసీ 14 రాష్ట్రాల్లో మొత్తం 2.10 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏడో, చివరి విడత సార్వత్రిక ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. ఏడో విడతలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ సహా 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 59 స్థానాలకు మే 19న ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 29 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. -
‘మూడో విడత’ ప్రచారానికి తెర
న్యూఢిల్లీ: దేశంలో మూడో విడత లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆదివారం తెరపడింది. మూడో విడతలో 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్(26), కేరళ(20), గోవా(2), దాద్రా నగర్ హవేలీ(1), డయ్యూ డామన్(1)లోని మొత్తం లోక్‌సభ స్థానాలకు.. అస్సాంలో 4, బిహార్‌లో 5, చత్తీస్‌గఢ్‌లో 7, జమ్మూకశ్మీర్‌లో 1, కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 14, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 10, పశ్చిమబెంగాల్లో 5 లోక్‌సభ స్థానాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయి. అమిత్‌షా పోటీ చేస్తున్న గాంధీనగర్(గుజరాత్), రాహుల్‌గాంధీ పోటీ పడుతున్న వయనాడ్(కేరళ), సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ పోటీ చేస్తున్న మొయిన్‌పురి(ఉత్తరప్రదేశ్) స్థానాలకు మూడో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలో కేంద్ర మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీ రోడ్‌షో నిర్వహిస్తుండగా ఎల్డీఎఫ్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పథినంతిట్ట జిల్లాలోని తిరువల్లలో బీజేపీ, కమ్యూనిస్టు కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఒక పోలీసుతో సహా 30 మంది గాయపడ్డారు. గుజరాత్‌లోనూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. -
మూడో విడత పోలింగ్‌కు ముగిసిన ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల మూడో విడత పోలింగ్‌కు ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసింది. 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తరించిన 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం పోలింగ్ జరగనుంది. గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, కర్నాటక, యూపీ, చత్తీస్‌గఢ్, ఒడిసా, బిహార్, పశ్చిమ బెంగాల్, అసోం, గోవా, జమ్మూ కశ్మీర్, త్రిపుర సహా దాద్రా నగర్ హవేలి, డామన్ డయ్యూలో మూడో విడత పోలింగ్ జరగనుంది. ధర్డ్ ఫేజ్‌లో పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు సుడిగాలి ప్రచారాలతో హోరెత్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా కాషాయ పార్టీ తరపున ర్యాలీలు, ప్రచార సభల్లో పాల్గొనగా, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీలు ఆ పార్టీ తరపున ప్రచారం చేపట్టారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం యూపీ సహా పలు రాష్ట్రాల్లో తమ అభ్యర్ధుల తరపున ప్రచార సభల్లో పాల్గొన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల ఐదో దశకు నామినేషన్ల పరిశీలన ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం తుదిగడువు కాగా, ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన పలు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఐదో విడత పోలింగ్ జరగనుంది. -
పల్లె సిగలో గులాబీ జెండా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: శాసనసభ ఎన్నికల విజయంతో ఊపుమీదున్న టీఆర్ఎస్ పార్టీ పంచాయతీ పోరులోనూ పైచేయి సాధించింది. మూడు విడతల్లో మొత్తం 558 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా.. 264 జీపీలు టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు స్వయంగా ఆయా పంచాయతీల్లో గెలుపు బాధ్యతలను తమ భుజాలపై వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కూడా చెప్పుకోదగ్గ రీతిలో జీపీలను హస్తగతం చేసుకున్నారు. 171 పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. ఇక రెండు విడతల్లో స్థబ్దుగా ఉన్న బీజేపీ చివరి దశ ఎన్నికలో కాస్త తేరుకుంది. 16 జీపీల్లో కాషాయ జెండాను ఎగురవేసింది. తుది విడతలో పోటాపోటీ.. మొదటి, రెండో విడతల ఎన్నికల ఫలితాలకు, తుది దశ ఫలితాల్లో కాస్త తేడా కనిపించింది. ఒకటి, రెండు విడతల్లో కారు ప్రభంజనం కొనసాగగా.. ఆఖరి దశ ఎన్నికలకు వచ్చే సరికి టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు పోటాపోటీగా తలపడ్డారు. ఈ రెండు పార్టీల నడుమ రసవత్తర పోరు నడిచింది. కొన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే అధికంగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. మూడు మండలాల్లో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మార్క్ కనిపించింది. ఈ మండలాల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఆమె గెలిపించుకోగలిగారు. ఆమె సొంత గడ్డ అయిన చేవెళ్ల, మొయినాబాద్, కందుకూరులో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించింది. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చేవెళ్ల నియోజకవర్గ కేంద్రమైన చేవెళ్ల పంచాయతీని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. ఇక సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న మహేశ్వరం నియోజకవర్గ కేంద్రంలో అధికార పార్టీ మద్దతుదారు పాగా వేయడం విశేషం. తగ్గిన పోలింగ్ శాతం తొలి, రెండో విడతలతో పోల్చితే తుది దశ ఎన్నికలు జరిగిన 186 జీపీల్లో పోలింగ్ శాతం తగ్గింది. మొదటి రెండు విడతల్లో 93 శాతం, 89 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా.. చివరి దశలో 88 శాతమే నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఉదయం 9 నుంచి 11 గంటలలోపే అధికశాతం మంది ఓటేశారు. ఈ రెండు గంటల వ్యవధిలో 37 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య 33 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక చివరి రెండు గంటల్లో 18 శాతం మంది ఓటేశారు. అన్ని పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
ముగిసిన పంచాయతీ ఎన్నికలు
సాక్షి, వరంగల్ రూరల్: నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటైన తర్వాత , స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదైంది. 89.78శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడో విడతలో చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూర్, దామెర, గీసుకొండ మండలాల్లోని 120 గ్రామ పంచాయతీలు, 1070 వార్డు స్థానాలకు ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 29 గ్రామాల్లో సర్పంచ్‌లు, 310 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 91 గ్రామాలు, 760 వార్డు స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చిన తమ ఓటును వినియోగించుకున్నారు. దామెర మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ హరిత పరిశీలించారు. జిల్లాలో 91.23శాతం ఓటింగ్.. మూడో విడతలోని చెన్నారావుపేట, నెక్కొండ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ మండలాల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదయింది. ఐదు మండలాల్లో 1,16,846 మంది ఓటర్లు ఉండగా 1,04910 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 57,898 మంది పురుష ఓటర్లుండగా 51,978, 58,939 మంది మహిళా ఓటర్లుండగా 52,932 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో 89.78శాతం ఓటింగ్ శాతం నమోదు కాగా అత్యధికంగా ఆత్మకూర్‌లో 92.28శాతం ఓటింగ్ నమోదు కాగా నెక్కొండలో తక్కువగా 88.02శాతం ఓటింగ్ నమోదయింది. మధ్యాహ్నం ఎన్నిక కౌంటింగ్ ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఎన్నికలు జరిగాయి. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ను ప్రారంభించారు. రాత్రి వరకు కౌంటింగ్‌ను నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల వారిగా ఫలితాలను ఎన్నికల అధికారులు ప్రకటించారు. -
నేడు 92 స్థానాల్లో పోలింగ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 92 లోక్‌సభ స్థానాలకు గురువారం సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ జరగనుంది. కేరళలో 20 సీట్లు, యూపీ, హర్యానా, ఒడిశా, మహారాష్ట్రలలో పదేసి స్థానాల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 9, ఢిల్లీలో 7, బీహార్‌లో 6, జార్ఖండ్‌లో 5, ఛత్తీస్‌గఢ్, జమ్మూకాశ్మీర్‌లలో ఒక్కో సీటుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన చండీగఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.