పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 5 గంటల వరకూ 53.24 శాతం పోలింగ్ నమోదు అయింది. కాగా శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. 78 నియోజకవర్గాల్లో 1,204 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనేందుకు సిద్ధమయ్యారు. ఇక నేడు బరిలో దిగిన వారిలో అసెంబ్లీ స్పీకర్‌తో పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రి వర్గంలోని 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు రెండు విడతల్లో 165 స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. ఈనెల 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.
78 అసెంబ్లీ స్థానాలతో పాటుగా వాల్మీకి నగర్ లోక్ సభ నియోజకవర్గం స్థానానికి ఉపఎన్నిక జరగతుంది. సిట్టింగ్ జేడీ(యూ) ఎంపీ బైద్యనాథ్ మహతా మృతితో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది.
- ఉదయం 9 గంటల వరకు 7.6 శాతం పోలింగ్ నమోదు
- మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటివరకు రెండు దశల్లో 165 చోట్ల పోలింగ్ పూర్తి
- మొత్తం 1,23,799 మంది పురుషులు, 12,06,378 మంది మహిళల ఓటర్లు
- నువ్వా నేనా అన్న రీతిలో ఎన్డీఏ- మహాకూటమి మధ్య కొనసాగుతున్న బీహార్ ఎన్నికల సమరం
- తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించిన సీఎం నితీష్ కుమార్
- ఎన్నికల బరిలో జేడీయూ తరఫున అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ చౌధరీ, పన్నెండు మంది
- మూడో దశలో మజ్లిస్ ప్రభావం
- కోసి-సీమాంచల్ ప్రాంతంలో భారీ సంఖ్యలో ముస్లిం ఓటర్లు
- పలువురు అభ్యర్థులను నిలిపిన మజ్లిస్ పార్టీ
Comments
Please login to add a commentAdd a comment