11 రాష్ట్రాల్లో 93 స్థానాలు
అహ్మదాబాద్/బెంగళూరు: పరస్పర వివాదాస్పద ఆరోపణలు, ఈసీకి ఫిర్యాదు లతో రాజకీయ పార్టీలు పెంచిన ప్రచారవేడి చల్లారాక నేడు కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశ పోలింగ్‌కు సిద్ధమైంది. 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ దశతో గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానా లకూ పోలింగ్ పూర్తి కానుంది. ఈ రాష్ట్రాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగిన విష యం తెల్సిందే. ఈసారి మూడో దశలో 120 మంది మహిళలుసహా 1,300కు పైగా అభ్యర్థులు పోటీపడు తున్నారు.
బరిలో అగ్రనేతలు, ప్రముఖులు
కేంద్రమంత్రులు అమిత్ షా(గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్‌సుఖ్ మాండవీయ(పోర్‌బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్(ఆగ్రా), మధ్యప్రదేశ్ మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్(విదిశ), దిగ్విజయ్‌సింగ్(రాజ్‌గఢ్), ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్, కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై (హవేరీ), బారామతిలో వదినా, మరదళ్లు సునేత్రా పవార్, సుప్రియా సూలే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
283 చోట్ల పోలింగ్ పూర్తి
ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్ నియోజక వర్గంలో బీజేపీ ఏకగ్రీవంగా గెల్చింది. గతంలో వాయిదాపడిన బైతుల్ నియోజ కవర్గంలో ఈరోజే పోలింగ్ నిర్వహిస్తు న్నారు. మూడోదశలో 11 కోట్లకుపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పశ్చిమబెంగాల్‌లో ఈరోజు పోలింగ్ ఉన్న నాలుగు స్థానాల్లోనూ ముస్లిం ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. కర్ణాటకలో ఈరోజు పోలింగ్ ఉన్న 14 స్థానాలనూ 2019 ఎన్నికల్లో బీజేపీ క్వీన్‌స్వీప్ చేసింది. మూడో దశ ముగిస్తే మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా పోలింగ్ పూర్తయిన స్థానాల సంఖ్య 283కి చేరుకుంటుంది. నాలుగో దశ మే 13న, ఐదో దశ మే 20న, ఆరో దశ మే 25న, ఏడో దశ జూన్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. అన్ని స్థానాలకు ఓట్ల లెక్కింపును జూన్ 4న చేపడతారు.
రాష్ట్రం సీట్లు
గుజరాత్ 25
కర్ణాటక 14
మహారాష్ట్ర 11
ఉత్తరప్రదేశ్ 10
మధ్యప్రదేశ్ 9
ఛత్తీస్‌గఢ్ 7
బిహార్ 5
అస్సాం 4
బెంగాల్ 4
గోవా 2
దాద్రానగర్, హవేలీ,
డయ్యూడామన్ 2
Comments
Please login to add a commentAdd a comment