సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అం శంపై అభిప్రాయసేకరణ వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగింది. కాంగ్రె స్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అను బంధ సంఘాల చైర్మన్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు... ఇలా దాదాపు 80 మంది నాయకులు శుక్రవారం ఠాగూర్‌ను కలిసి అభిప్రాయాలను తెలియజేశారు. గత ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్య ర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో కూడా ఆయన శని వారం మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసు కుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.
కొండా దంపతుల భేటీ
కాగా, శుక్రవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు మాణిక్యం ఠాగూర్‌తో భేటీ అయ్యారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై తమ అభిప్రాయాలు చెప్పిన కొండా దంపతులతో వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల గురించి మాణిక్యం చ ర్చించారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, జిల్లా లోని అందరు నేతలతో సమ న్వయం చేసుకోవాలని కొండా దంపతులకు ఆయన చెప్పినట్టు తెలిసింది. బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా గాంధీభవన్‌కు వచ్చి మాణిక్యంను కలిశారు. పార్టీ మారే అంశంపై విలేకరులు మహేశ్వర్‌రెడ్డిని ప్రశ్నించగా, తా ను పార్టీ మారేటట్లయితే ఇప్పుడు గాంధీభ వన్‌కు ఎందుకు వస్తానని, ఈ ప్రచారం ఎలా జరుగుతోందో అర్థం కావడం లేదన్నారు.
పారిశ్రామిక పార్కులు అమ్మే కుట్ర: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: రాజధాని చుట్టుపక్కల పారిశ్రామిక పార్కులకు కేటాయించిన భూములను ఐటీ పార్కుల పేరిట ప్రైవేటు కంపెనీలకు అమ్మేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. కూకట్‌పల్లి, గాంధీనగర్, బాలానగర్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్, మౌలాలీ, పటాన్‌చెరు, రామచంద్రాపురం, సనత్‌నగర్, కాటేదాన్ ప్రాంతాల్లోని భూములను మంత్రి కేటీఆర్ స్నేహితులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ పారిశ్రామిక పార్కుల్లో చాలాకాలంగా వేలాది పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వారి పరిస్థితి ఏంటన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
‘టీఆర్‌ఎస్‌తో బీజేపీకి చీకటి ఒప్పందం’
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌తో బీజేపీకి చీకటి ఒప్పందం ఉందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లో బీజేపీని తిట్టే కేసీఆర్ రాత్రికి ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్‌షాలతో మంతనాలు జరుపుతారని ఎద్దేవా చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మా ట్లాడారు. కేసీఆర్ లేనిదే తెలంగాణ లేదు అనేది అవాస్తవమని, సోనియా, రాహుల్ గాంధీలు తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఇలా మాట్లాడ గలిగేవాడా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment