పీసీసీ చీఫ్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. | Karnataka PCC Chief DK Shivakumar Helicopter Emergency Landing | Sakshi
Sakshi News home page

పీసీసీ చీఫ్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అద్దం పగిలి..

Published Tue, May 2 2023 2:26 PM | Last Updated on Tue, May 2 2023 2:49 PM

Karnataka PCC Chief DK Shivakumar Helicopter Emergency Landing - Sakshi

బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెచ్ఏఎల్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.  ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది.

శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని  జక్కూర్ ఎయిర్‌పోర్టు నుంచి కోలార్‌ జిల్లాలోని ముల్‌బాగల్ వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపరిపీల్చుకున్నాయి.

ఘటన సమయంలో హెలికాప్టర్‌లో డీకే శివకుమార్‌ను ఓ కన్నడ టీవీ ఛానల్ జర్నలిస్టు ఇంటర్వ్యూ  చేస్తున్నారు. పైలటతో కలిపి మొత్తం ముగ్గురు హెలికాప్టర్‌లో ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతల ో జరగనున్న విషయం తెలిసిందే. 13 న కౌంటింగ్ ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలున్నాయి. మెజార్టీకి 123 సీట్లు అవసరం. ఈ సారి కచ్చితంగా 150  స్థానాలకుపై కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
చదవండి: లిక్కర్‌ స్కాం కేసు: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దాకు షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement