
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హొన్నావర్‌లోని రామకొండతీర్థ కొండ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో శివకుమార్ సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు.
కాగా మొన్నటికి మొన్న శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలింది. పైలట్లు అత్యంత చాకచక్యగా వ్యవహరించడంతో శివకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ చీఫ్‌ను రెండు ప్రమాదాలు వెంటాడంతో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: శరద్ పవార్ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్‌గా సూలేనా?.. అజిత్ పవర్?