helipod
-
హెలిప్యాడ్ వద్ద మంటలు.. మరోసారి డీకే శివకుమార్‌కు తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు మరోసారి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అయిన కొద్దిసేపటికే హెలిప్యాడ్ స్థలంలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హొన్నావర్‌లోని రామకొండతీర్థ కొండ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదంలో శివకుమార్ సురక్షితంగా బయటపడంతో అందరూ ఊపరిపీల్చుకున్నారు. కాగా మొన్నటికి మొన్న శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొట్టిన విషయం తెలిసిందే. దీంతో హెలికాప్టర్ విండ్ షీల్డ్ పగిలింది. పైలట్లు అత్యంత చాకచక్యగా వ్యవహరించడంతో శివకుమార్ ప్రాణాలతో బయటపడ్డారు. వారం రోజుల వ్యవధిలోనే కాంగ్రెస్ చీఫ్‌ను రెండు ప్రమాదాలు వెంటాడంతో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: శరద్ పవార్ రాజీనామా: తదుపరి ఎన్సీపీ చీఫ్‌గా సూలేనా?.. అజిత్ పవర్? -
ప్రపంచంలో అత్యంత పొడవైన కారును చూశారా..!
మనకు కన్పించే కార్ల పొడవు ఎంతగా ఉంటుంది...మామూలుగా ఐతే సగటు కార్ల పొడవు సుమారు 14.7 అడుగులుగా ఉంటుంది. కొన్ని కార్ల పొడవు సుమారు 15-16 అడుగులుగా ఉంటాయి. 100 అడుగుల పొడవైన కారును ఎప్పుడైన మీరు చూశారా..! 100 అడుగుల కారు ఎక్కడైనా ఉంటుందా...అని కోపంగా తింటుకుంటున్నారా...అయితే మీరు అక్కడే ఆగండి..? చూడటానికి రైళ్లు లాగా ఉండే 100 అడుగుల కారు గురించి తెలుసుకుందాం..! అమెరికన్ డ్రీమర్..! 1986లో ఒక కారు ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.ఈ కారు పొడవు సుమారు 100 అడుగులు. ఈ వన్-ఆఫ్ రికార్డ్ లెంగ్త్ లిమోసిన్‌ను అమెరికన్ డ్రీమ్‌గా పిలుస్తారు. దీనిని లిమోసిన్ అని కూడా అంటారు. అమెరికన్ డ్రీమ్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం...! అమెరికన్ డ్రీమర్ కారులో ఏకంగా హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడం కోసం ఏకంగా హెలిప్యాడ్ కూడా ఉంది. అంతేకాకుండా మినీ గోల్ఫ్ కోర్స్, జాకుజీ, బాత్‌టబ్, పదుల సంఖ్యలో టీవీలు, ఫ్రిజ్‌లు ఉన్నాయి. వాటితో పాటుగా ఈ కారులో స్విమ్మింగ్ పూల్ ఉంది. ఈ కారులో సుమారు 70 మంది కూర్చునే అవకాశం ఉంది. ఈ కారు 26 చక్రాలతో నడుస్తుంది. కారులో లిమోసిన్ కారుకు చెందిన బహుళ వీ8 ఇంజన్లను ఏర్పాటుచేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అమెరికన్ డ్రీమ్ కారును ఏ ఆటోమొబైల్ కంపెనీ రూపొందించలేదు. ఈ కారును హాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ వాహన డిజైనర్ జే ఓర్‌బర్గ్ రూపొందించారు. జే ఒర్ బర్గ్ కార్లను రిమోడలింగ్ చేయడంలో సిద్దహస్తుడు. అతను తొలిసారిగా 1980లో అమెరికన్ డ్రీమ్‌ని డిజైన్ చేశాడు.అమెరికన్ డ్రీమ్ ప్రాథమికంగా 1976 కాడిలాక్ ఎల్డోరాడో లిమోసిన్ మోడల్ కార్ ఆధారంగా నిర్మించారు. ఇది రోడ్లపైకి రావడానికి సుమారు 12 సంవత్సరాలు పట్టింది. తొలుత సినిమాల్లో..! అమెరికన్ డ్రీమ్‌ను మొదట సినిమాల్లో ఉపయోగించే వారు. అంతేకాకుండా పలు ఆటోమొబైల్ ఈవెంట్లలో ప్రదర్శించేవారు. 1992 కాలంలో ఈ కారులో తిరిగేందుకు సుమారు గంటకు గంటకు రూ. 14 వేలు చెల్లించాల్సి ఉండేది. ఆ సమయంలో లిమోసిన్ ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. క్రమంగా అది నిర్వహణకు అవసరమైన శ్రద్ధను కోల్పోయింది. అంతే కాకుండా సినిమాల్లో కూడా అంత పొడుగు కార్లకు డిమాండ్ తగ్గింది. దీనికి భారీ పార్కింగ్ స్థలం అవసరం. దీంతో ఈ కారు మూలకు పడింది. ప్రస్తుతం న్యూయర్క్ చెందిన ఓ సంస్థ అమెరికన్ డ్రీమ్‌ను తిరిగి పునర్వైభవాన్ని తీసుకురావాలని చూస్తోంది. చదవండి: బ్రిటన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పుడు భారత్‌లో..! ధర ఏంతంటే..? -
వరద నీటిలో చంద్రబాబు హెలీప్యాడ్
సాక్షి, అమరావతి: ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. కృష్ణానదీ తీరానా ప్రతిపక్ష నేత చంద్రబాబు అక్రమ కట్టడ నివాసం వద్ద పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. దీంతో నివాసంలోని గార్డెన్, బయట ఉన్న హెలీప్యాడ్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 ట్రక్కుల చిప్స్, ఇసుక బస్తాలను వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి కూడా ఆపలేకపోతున్నాయి. రివర్ ఫ్రంట్ వ్యూ భవనం, వాక్‌వే ఇప్పటికే నీట మునిగాయి. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టుతోంది. శనివారం సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో నివాసంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారుల హెచ్చరించారు. చంద్రబాబు నివాసంలోని పంటపొల్లలోకి కూడా వరద నీరు భారీగా చేరుతోంది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు హై సెక్యూరిటీ జోన్‌లోని తన ఇంటిపై డ్రోన్లతో నిఘా వేశారంటూ చంద్రబాబు ట్వీట్లపై ట్వీట్లు చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నది గర్భంలో, కరకట్టపై నిర్మించిన అక్రమ భవనాల్లోకి ప్రవహాం కొనసాగుతోంది. ఇదిలావుండగా.. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. -
ఇవి ఎయిర్‌పోర్టుల డిజైన్లు కావు..
► అంతా జనం హడావుడి.. గజిబిజి.. రైలొచ్చిందంటే చాలు.. దిగేవారు.. ఎక్కేవారితో.. కిక్కిరిసిపోతుంది.. ఇరుకిరుకు వెయిటింగ్ హాళ్లు.. బాత్రూంల సంగతైతే చెప్పనక్కర్లేదు.. రైల్వేస్టేషన్ అంటే మనకు గుర్తొచ్చేది ఇదే.. ► ఇప్పుడీ ఫొటోల మీద ఓ లుక్కేసుకోండి.. ఇవి ఎయిర్‌పోర్టుల డిజైన్లు కావు.. రైల్వేస్టేషన్లవే.. ఇందులో అత్యాధునిక సదుపాయాలున్న వెయిటింగ్ హాళ్లు, రద్దీ లేకుండా.. ప్రయాణికులు రావడానికి, పోవడానికి వేర్వేరు టెర్మినళ్లు.. ఎయిర్‌పోర్టుల్లో ఉండే విలాసవంతమైన సౌకర్యాలు, షాపింగ్‌మాళ్లు, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, చిన్నస్థాయి ఆస్పత్రులు, మెట్రో.. బస్సులతో కనెక్టివిటీ.. ఒకటా రెండా అన్నీనూ.. వీవీఐపీల కోసం హెలీపాడ్ కూడా ఉంటుంది.. ఇవన్నీ మన రైల్వేస్టేషన్లలోనే.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్ల ప్రాజెక్టులో భాగంగా ఇవన్నీ సాధ్యమేనంటున్నారు రైల్వే అధికారులు.. ఈ చిత్రాలు గుజరాత్‌లోని సూరత్, మధ్యప్రదేశ్‌లోని హబీబ్‌గంజ్ రైల్వేస్టేషన్లవి.. ప్రపంచస్థాయి రైల్వేస్టే షన్లుగా తయారుచేయడంలో భాగంగా వీటినిలా మార్చేస్తారన్నమాట. దేశంలోనే తొలి ప్రపంచస్థాయి రైల్వేస్టేషన్‌గా మారబోతున్న హబీబ్‌గంజ్‌లో ఇప్పటికే పనులు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. కనీసం వెయ్యి వాహనాలకు సరిపోయేలా ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. మరికొన్ని స్టేషన్ల పనులు బిడ్ల దశలో ఉన్నాయి. దేశంలోని పలు స్టేషన్లను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్లుగా మార్చేందుకు ఫ్రాన్స్, బెల్జియం, జపాన్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఆసక్తి చూపుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు.