సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఆక్సిజన్ సప్లై పూర్తిగా అందుబాటులో ఉందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కొందరు ఆక్సిజన్‌పై తప్పుడు రిపోర్టులు ఇచ్చి ప్రజలు, అధికారుల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర వ్యాప్తంగా 322 ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులకు ట్రీట్‌మెంట్ జరుగుతోంది. 75 శాతానికి పైగా బెడ్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గత 24 గంటల్లో 71,758 శాంపిల్స్ టెస్ట్ చేస్తే 2,224 మందికి పాజిటివ్ వచ్చింది. 31 మంది కోవిడ్ కారణంగా చనిపోయారు ’’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment