తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి సీఎం కేసీఆర్ శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో కేసీఆర్‌కు వేదిపండుతులు ఆశీర్వచనం చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయంలో, తిరుమలలో ఆయనకు ఘనస్వాగతం లభించింది.