తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై మాజీ ఎంపీ చింతమోహన్ స్పందించారు. ఈ క్రమంలో శనివారం విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన పలు అనుమానాలు లేవనేత్తా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల హుండీ ఆదాయం రోజూ ప్రకటిస్తున్న టీటీడీ అధికారులు.. నిలువు దోపిడీ ఆదాయం వివరాలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. హుండీలో భక్తులు వేస్తోన్న విలువైన వజ్రాలు లెక్కల్లోకి రాకుండా మధ్యలోనే కొందరి చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు.