
సాక్షి, అమరావతి: కోవిడ్ నివారణకు వినియోగించే రెమ్‌డెసివర్ ఇంజెక్షన్ గరిష్ట ధరను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ బ్రాండులు అందిస్తున్న 100ఎంజీ రెమ్‌డెసివర్ గరిష్ట ధరని రూ.2,500గా నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్న ఆస్పత్రులతో పాటు నెట్ వర్క్ పరిధిలో లేని ఆస్పత్రులు కూడా కోవిడ్ పేషెంట్ల నుంచి ఈ ఇంజెక్షన్ ధరను రూ.2,500 మించి వసూలు చేయకూడదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.