
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తృతంగా వ్యాపిస్తోంది. కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య (రికవరీ రేటు) చాలా రాష్ట్రాల్లో భారీగా పడిపోయింది. జాతీయ సగటు రికవరీ రేటు 84కు పడిపోయింది. అయితే చాలా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో రికవరీ రేటు బాగున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మహరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రికవరీ రేటు గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 92.53 శాతంగా ఉంది. క్షేత్రస్థాయిలో భారీగా వ్యాక్సిన్ వేయడం, ఫీవర్ సర్వే చేసి బాధితులను గుర్తించడం, ఆస్పత్రుల పునరుద్ధరణ, హోం ఐసొలేషన్ కిట్‌ల పంపిణీ వంటి వాటి కారణంగా కరోనా బాధితులు త్వరగానే కోలుకుంటున్నారు. దీన్నిబట్టి కొంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని, ప్రజలు కొద్ది రోజులు జాగ్రత్తలు తీసుకుంటే మహమ్మారి బారి నుంచి బయట పడవచ్చునని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment