
సాక్షి, తిరుపతి : భారత్‌లో కరోనా వైరస్ సోకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతన్న నేపథ్యంలో టీటీడీ ముందుస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. తిరుమల, అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో అనుమానితుల గుర్తింపునకు పరికరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఈ క్రమంలోనే శుక్రవారం అలిపిరి టోల్ గేట్ వద్ద టీడీపీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డిలు కరోనా నివారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే ప్రతి 2 గంటలకోసారి తిరుమలలో పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నట్టు టీటీడీ పేర్కొంది. తిరుమల, తిరుపతిలో కరోనా వైరస్ అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది.
మరోవైపు కరోనా ఆందోళనల నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలో ఏప్రిల్ 7న నిర్వహించే కోదండరామస్వామి కళ్యాణన్ని రద్దు చేసే యోచనలో టీటీడీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు హాజరుకానున్నడంతో.. కళ్యాణం నిర్వాహణకు సంబంధించి ప్రభుత్వానికి లేఖ రాసినట్టు సింఘాల్ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుమతించకపోతే ఆలయంలోనే సింపుల్‌గా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని చెప్పారు.