
సాక్షి,అమరావతి: వ్యాక్సిన్ ఉత్పత్తి కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నా బిడ్లు దాఖలు చేయలేదని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఏపీలో నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ .. నిబంధనల ప్రకారం బిడ్ల దాఖలుకు మరో 2 వారాల గడువిస్తామని చెప్పారు. అయితే గడువిచ్చినా బిడ్లు దాఖలవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏపీలోనే కాదు యూపీలో కూడా బిడ్లు దాఖలు కాలేదని వెల్లడించారు. కాగా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సీఎంలందరికీ సీఎం జగన్ లేఖలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment