( ఫైల్ ఫోటో )
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు స్పెషల్ సీఎస్ అనిల్ కుమార్ సింఘల్ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం. యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు.
ఇది కూడా చదవండి: మాతో పొత్తా?.. పద్ధతిగా ఉండదు! చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment