
సాక్షి, తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనాలతో ‘బ్రహ్మోత్సవానికి బ్రహ్మాండ నీరాజనం’శీర్షికన ప్రచురితమైన సాక్షి ‘ఫన్ డే’పుస్తకాన్ని గురువారం చిన్నశేషవాహనం ఊరేగింపులో ఆవిష్కరించారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌సింఘాల్ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక సంచిక తీసుకొచ్చిన ఘనత సాక్షి యాజమాన్యానికే దక్కిందని కొనియాడారు. తిరుమలేశుని లీలా వైభవం, కంటి మీద కునుకేలేని స్వామి, ఆలయంలోని కైంక ర్యాలు, చారిత్రక నేపథ్యం, భక్తులకు టీటీ డీ కల్పించే సౌకర్యాలు, కొత్త మార్పులతోపాటు అరుదైన ఫొటోలతో ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలతో వెలువడిన ‘ఫన్ డే’సంచిక విశ్లేషణాత్మకంగా ఉందన్నారు. సాక్షి యాజమాన్యం, విలేకరుల బృందాన్ని ఈవో అభినందించారు.
ఫండే బుక్‌ను ఆవిష్కరిస్తున్న టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ..చిత్రంలో సాక్షి ప్రతినిధులు