గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు | Anil Kumar Singhal Take Charge As Chief Secretary To AP Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు

Published Sat, Feb 4 2023 7:17 PM | Last Updated on Sat, Feb 4 2023 7:18 PM

Anil Kumar Singhal Take Charge As Chief Secretary To AP Governor - Sakshi

సాక్షి, అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. 1993 బ్యాచ్‌కు సింఘాల్ ఇప్పటి వరకు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించారు. రాజ్ భవన్‌లో మాననీయ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సింఘాల్ మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరివురు కొద్దిసేవు సమావేశం అయ్యారు. సింఘాల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో కీలకమైన శాఖలలో బాధ్యతలు నిర్వర్తించి మంచి అధికారిగా తనదైన ముద్ర వేసారు.

కేంద్రంలో అత్యంత కీలకమైన డిఓపిటి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేసారు. కీలకమైన కరోనా సమయంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలు అందించి రాష్ట్ర ప్రజల మన్ననలు అందుకున్నారు.

టీడీడీ ఈవోగా పలు సంస్కరణలకు బీజం వేశారు. విశాఖపట్నం, తూర్పు గోదావరి, మెదక్ కలెక్టర్ గా, చిత్తూరు, గుంటూరు సంయిక్త కలెక్టర్‌గా ఆయా జిల్లాలలో తనదైన ముద్ర వేశారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉట్నూరు, కేఆర్ పురంలలో, సబ్ కలెక్టర్‌గా గద్వాల్ లో ప్రజలకు ఇతోధిక సేవలందించారు. సర్వీసు తొలి రోజుల్లో నెల్లూరు, అనంతపురం ఉప కలెక్టర్‌గా వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement