
తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు
తిరుమల : తిరుమలకు శనివారం వీఐపీలు క్యూ కట్టారు. సినీనటుడు అర్జున్, లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం రాంనారాయణరెడ్డి, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు విడివిడిగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండలంలో తీర్థప్రసాదాలు అందుకున్నారు.
అనంతరం ఆనం రాంనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీపై పిల్లిమొగ్గలేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే మనసు ఇవ్వాలని వెంకన్నను వేడుకున్నట్లు చెప్పారు.