
సాక్షి, తిరుమల: హాట్ కేకుల్లా శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ నెల దర్శన టిక్కెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. గంట 25 నిముషాల వ్యవధిలోనే ఆర్జిత సేవా టిక్కెట్లను భక్తులు పొందారు. 2 నిముషాల 30 సెంకడ్ల వ్యవధిలోనే అంగప్రదక్షణ టికెట్ల విక్రయాలు జరిగాయి.
10 నిముషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయో వృద్దులు, వికలాంగుల దర్శన టిక్కెట్లు పొందారు. 2 గంటల 6 నిముషాల వ్యవధిలోనే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు భక్తులు పొందారు. గంటా 40 నిముషాల వ్యవధిలోనే వసతి గదులు కోటాను భక్తులు పొందారు
కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 16 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సోమవారం అర్ధరాత్రి వరకు 71,824 మంది స్వామివారిని దర్శించుకోగా, 28,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.01 కోట్లు సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment