రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల | Release of Srivari Arjita Seva tickets tomorrow | Sakshi
Sakshi News home page

రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

Published Fri, Oct 18 2024 5:03 AM | Last Updated on Fri, Oct 18 2024 5:03 AM

Release of Srivari Arjita Seva tickets tomorrow

తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి కోటాను అక్టోబర్‌ 19న ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. కాగా కళ్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్‌ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. 

అలాగే వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి కోటాను అక్టోబర్‌ 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

23న అంగప్రదక్షిణ టోకెన్లు: జనవరికి సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్‌ 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్‌ టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా: జనవరికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టో­బర్‌ 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరు­పతిల్లో జనవరి గదుల కోటాను మధ్యాహ్నం 3 గంట­ల­కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.   https://­ttdevasthanams.­­ap.gov.in    ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement