
Srivari Special Darshan Quota Tickets: శ్రీవారి ప్రత్యేక దర్శనం రూ.300 టికెట్లను ఫిబ్రవరి నెలకు సంబంధించి టీటీడీ శుక్రవారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రోజుకి 12 వేల చొప్పున టోకెన్లను విడుదల చేసింది. ఫిబ్రవరి నెలకు స్లాటర్ సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టికెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ పీఆర్‌వో విభాగం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులంతా టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
చదవండి: (కొత్త పీఆర్సీ ప్రకారమే జనవరి వేతనాలు.. ఏపీ ఆర్థికశాఖ ఉత్తర్వులు)
Comments
Please login to add a commentAdd a comment