తిరుమల: వయోవృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలకు ఈ నెలలో నాలుగు రోజులు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 10, 24 తేదీల్లో వయో వృద్ధులు, దివ్యాంగులు, 11, 25 తేదీల్లో చంటి పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకోసం ఉదయం 10 గంటల స్లాట్‌కు 1000 టికెట్లు, మధ్యాహ్నం 2 గంటల స్లాట్‌కు 2000 టికెట్లు, 3 గంటల స్లాట్‌కు 1000 టికెట్లు జారీ చేయనున్నారు.
గుర్తింపు పత్రం తప్పనిసరి..
ప్రత్యేక దర్శనానికి వచ్చేవారు టోకెన్లు తీసుకునేటప్పుడు ఆధార్ లేదా ఓటర్ గుర్తింపు కార్డు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. రాయితీపై 20 రూపాయలకు 2లడ్డూలు, 70 రూపాయలకు 4 లడ్డూలు తీసుకోవచ్చు. వెయిటింగ్ హాల్ నుంచి ప్రత్యేక క్యూ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. నడవలేని వారిని శ్రీవారి సహాయకులతో పంపుతారు. 5 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సుప«థం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.
వయోవృద్ధులకు 4 రోజులు ప్రత్యేక దర్శనం
Published Mon, Jul 9 2018 2:19 AM | Last Updated on Mon, Jul 9 2018 2:19 AM
Advertisement
Advertisement