
తిరుమలలో ప్రత్యేక దర్శనం నిలిపివేత
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో ప్రత్యేక దర్శనం నిలిపివేశారు. శ్రీవారి సర్వ దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. కాలి నడక భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఇంకా కిలోమీటరు మేర భక్తులు బారులు తీరారు.
భక్తుల రద్దీ దృష్ట్యా శ్రీవారి ఆలయంలో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం 2 కోట్ల 56 లక్షల రూపాయలు.