
20 నిమిషాల్లోనే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం
ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందాలంటే ఏదైనా గుర్తింపు కార్డును జతచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరోజు ముందు కొనుగోలు చేసే భక్తులకు రూ.250 రాయితీ ప్రకటించారు. సాధారణ భక్తులకు తిరుమల తరహాలో మహాలఘు దర్శనం అమలు చేస్తామన్నారు. మహాశివరాత్రికి ఆలయాన్ని తోరణాలు, విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.