Sivaratri
-
Mahashivratri: కాశీ విశ్వేశ్వరుని నిరంతర దర్శనం.. 8 గంటల పాటు కల్యాణం
వారణాసి: ఫిబ్రవరి 26.. మహాశివరాత్రి(Mahashivratri) వేళ భక్తులు కాశీవిశ్వేశ్వరుణ్ణి మరింత సమయం దర్శించుకునేందుకు అవకాశం కలిగింది. 26న తొలి మంగళహారతి మొదలుకొని 27న జరిగే శయన హారతి వరకూ భక్తులు మహాశివుణ్ణి దర్శించుకోవచ్చు. ఆ రోజున పార్వతీ పరమేశ్వరుల కల్యాణం ఎనిమిది గంటలపాటు జరగనుంది.కాశీ విశ్వనాథుని ఆలయ అధికారి విశ్వభూషణ్ శివరాత్రి ఏర్పాట్ల గురించి మీడియాకు తెలిపారు. ఫిబ్రవరి 25న శయన హారతి అనంతరం గర్భగుడిని మూసివేస్తామన్నారు. అనంతరం 26న తెల్లవారుజామున 2:30కి మహాశివునికి మంగళహారతి ఇస్తామన్నారు. ఇది పూర్తయ్యాక దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఫిబ్రవరి 27న జరిగే శయన హారతివరకూ ఆలయం తలుపులు తెరిచేవుంటాయన్నారు. ఈ సమయంలో భక్తులు స్వామివారిని సందర్శించుకోవచ్చన్నారు. మహా శివరాత్రివేళ సప్తరుషి శృంగార హారతి ఉండదన్నారు.ఫిబ్రవరి 26న రాత్రి 8 గంటలపాటు శివపార్వతుల కల్యాణం(marriage of Shiva and Parvati) జరగనున్నదని విశ్వభూషణ్ తెలిపారు. ఈసారి మహాశివరాత్రికి 14 లక్షలకు పైగా భక్తులు తరలివస్తారనే అంచనాలున్నాయన్నారు. భారీగా భక్తులు వస్తున్నందున అందరికీ దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumb: నేడు, రేపు జనప్రవాహం.. పర్యవేక్షణలో సీఎం యోగి -
శివరాత్రికి ‘మోనాలిసా’ సందడి.. ఎక్కడంటే..
కుంభమేళాలో పూసల దండలు అమ్ముకునేందుకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మోనాలిసా ఇప్పుడు విదేశీయానం కూడా చేయబోతున్నారు. అది కూడా శివరాత్రి రోజున.. వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్న మోనాలిసా ఖ్యాతి ఇప్పుడు విదేశాలను కూడా తాకింది. ఇంతకీ మోనాలిసా ఎక్కడికి వెళ్లబోతున్నారు? ఏ దేశం నుంచి ఆమెకు ఆహ్వానం అందింది?మారుమూల గ్రామం నుంచి మహానగరం ముంబైకి చేరుకున్న మోనాలిసా త్వరలో బాలీవుడ్ సినిమాలో హీరోయిన్గా కనిపించనున్నారు. అయితే ఇంతలోనే ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు. ఇటీవలి కాలంలో మోనాలిసా ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కాగా ఫిబ్రవరి 26న మోనాలిసా నేపాల్‌లో జరిగే శివరాత్రి వేడుకల్లో పాల్గొననున్నారు. ఇందుకు ఆమెకు ఇప్పటికే ప్రత్యేక ఆహ్వనం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మోనాలిసా సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సనోజ్ మిశ్రా ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.ఈ కార్యక్రమ వివరాలను సనోజ్ మిశ్రా ఒక వీడియో ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ఈ వీడియోలో మోనాలిసా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ అందరినీ ఆహ్వానించారు. ప్రస్తుతం మోనాలిసా దర్శకుడు సనోజ్ మిశ్రా సహకారంతో నటనతో పాటు చదవడం, రాయడం కూడా నేర్చుకుంటున్నారు. తాజాగా ఆమె న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. కుంభమేళాకు వచ్చిన 16 ఏళ్ల మోనాలిసా తన తేనె కళ్లతో అందరి దృష్టిలో పడ్డారు. రాత్రికిరాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయారు.ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా.. -
Maha Kumbh: మిగిలినవి అమృత స్నానాలు కాదు.. కారణమిదే
మహా కుంభమేళాలోని మూడవ, చివరి అమృత స్నానం వసంత పంచమి(ఫిబ్రవరి 3) నాడు ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26న ముగుస్తుంది. ఈ సమయంలో మూడు ప్రముఖ రోజులలో అమృత స్నానాలు జరిగాయి. ఇంకో రెండు పుణ్యస్నానాలు కూడా ఉన్నాయి. అయితే పండితులు వాటిని అమృత స్నానాలుగా పరిగణించరు.మాఘ పూర్ణిమ(ఫిబ్రవరి 12), మహాశివరాత్రి(ఫిబ్రవరి 26) రోజులలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ స్నానాల సమయంలో అమృత ఘడియలు లేవని చెబుతారు. మొఘలుల కాలం నుండి నాగ సాధువులకు ప్రత్యేక గౌరవం ఇస్తూ, వారికి ప్రత్యేక రాజ స్నానాల హోదాను కల్పించారు. ఆది శంకరాచార్యులు(Adi Shankaracharya) ధర్మ సంరక్షకునిగా నాగ సాధువుల బృందాన్ని ఏర్పాటు చేశారు. నాగ సాధువులకు మొదట స్నానం చేసే హోదాను కూడా శంకరాచార్యులే కల్పించారని చెబుతారు.నాగ సాధువులు వసంత పంచమి నాడు అమృత స్నానం చేశాక వారి నివాసస్థానాలకు వెళ్లిపోతారు. అమృత స్నానాల నిర్ణయం వెనుక మరో కారణం కూడా ఉంది. సూర్యుడు మకర రాశిలో.. బృహస్పతి వృషభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే రాజ స్నానాలు చేస్తారు. వీటినే అమృత స్నానాలు అని కూడా ఉంటారు. మాఘ పూర్ణిమ(Magha Purnima) నాడు, బృహస్పతి వృషభరాశిలో ఉంటాడు. సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అదేవిధంగా శివరాత్రి రోజున కూడా సూర్యుడు కుంభ రాశిలోనే ఉంటాడు. ఫలితంగా అది పవిత్ర స్నానం అవుతుంది. కానీ దానికి అమృత స్నానం అనే స్థితి లభించదు.ఇది కూడా చదవండి: 5న ప్రధాని మోదీ కుంభస్నానం -
శివుడిపై అద్భుతమైన పాట వైరల్.. డాక్టర్ నాగ మాధురి గాత్రానికి ఫిదా!
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగా డా: నాగ మాధురి ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. డాక్టర్‌గా సేవలు అందిస్తూనే ఆమెలో మరో టాలెంట్ కూడా దాగి ఉంది. అందరినీ మెచ్చేలా పాటలు పాడగలదు. ఒకపైపు వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ... సరి చేస్తూనే... సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు. బహుముఖ ప్రతిభాశాలిగా డాక్టర్ నాగ మాధురి మెప్పిస్తున్నారు. ఉన్నత విద్యా సంపన్న కుటుంబంలో జన్మించిన నాగ మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ చూపేవారు. చదువులో చాలా చురుగ్గా ఉంటూనే.. చిత్ర కళ, గానంలో విశేష ప్రతిభ కనబరిచేవారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ వైజర్సు సుబ్రహ్మణ్యం దగ్గర సంగీతంలో శిష్యరికం చేశారు. కర్నాటిక్ క్లాసిక్ మ్యూజిక్‌లో డిప్లొమా చేయడంతోపాటు అందులో డిష్టింక్షన్ సాధించడం నాగ మాధురి ప్రతిభను చెప్పకనే చెబుతుంది. ఆప్తమాలజీ (కంటి వైద్యం) స్పెషలిస్ట్‌గా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్‌కి మేనేజింగ్ పార్టనర్ కమ్ ఛీఫ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తూనే.. సంగీతంలోనూ సాధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ శివరాత్రికి కానుకగా ఆ మహా శివుడిపై ప్రేమతో అద్భుతమైన పాటను ఆమె పాడారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో పేరుగాంచిన స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో "శంభో మహాదేవ... శంకర గిరిజా రమణ" త్యాగరాజ కృతిని ఆలపించి.. 'గాన మాధురి' అనే తన పేరును సార్ధకం చేసుకున్నారు నాగ మాధురి. 15 సంగీత వాయిద్యాలలో నిష్ణాతులు అయిన సుభాని గారు కీరవాణి, థమన్, రెహమాన్, అనిరుద్ వంటి దిగ్గజ దర్శకులకు తన వాద్య సహకారం అందిస్తుంటారు. ఇకపోతే... "శంభో మహాదేవ" ఆడియో అండ్ వీడియో ఆల్బమ్‌ను మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ ఆవిష్కరించి, అభినందించడం విశేషం. "శంభో మహదేవ" ఆల్బమ్ అనే తన కల సాకారం దాల్చడంలో మాండలిన్ సుభాని గారి స్ఫూర్తి, విశ్వనాధ్ అరిగెల సహకారం, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలి సపోర్ట్ ఎంతైనా ఉందని డాక్టర్ నాగ మాధురి అన్నారు. మణిశర్మ గారి మంచితనాన్ని, ఆయన అభినందనను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు. -
శివరాత్రి ట్వీట్: సోనూసూద్‌పై మండిపాటు
సాక్షి,ముంబై: బాలీవుడ్ నటుడు సోనూసూద్‌ను మరో వివాదం చుట్టుముట్టింది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన వేలాది వలస కార్మికులను ఆదుకుని రియల్ హీరో నిలిచిన సోనూసూద్‌పై ఇపుడు కొంతమంది నెటిజన్లు మండిపడుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఆయన చేసిన ట్వీటే దీనికి కారణం. దీనిపై కొంతమంది హుదహెల్ఆర్యు సోనూసూద్ (#WhoThe Hell AreU SonuSood) హ్యాష్‌ట్యాగ్‌తో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు అభిమానులతోపాటు మరికొంతమంది యూజర్లు సోనూసూద్‌కు మద్దతుగా నిలుస్తుండటం విశేషం. (కొత్తవారిని ప్రోత్సహించాలి!) శివుడి చిత్రాలను ఫార్వార్డ్ చేయడానికి బదులుగా ఎవరికైనా సహాయం చేయడం ద్వారా మహాశివరాత్రిని జరుపుకోండి అంటూ గురువారం తెల్లవారుజామున సోనూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్లోని అంతరార్థాన్ని అర్థం చేసుకోకుండా కొంతమంది ఆయనపై దూషణలకు దిగారు. మతవిద్వేషాన్ని ఉసిగొల్పేలా కమెంట్ చేస్తున్నారు. అయితే గత ఏడాది దేశంలో కరోనావైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, వేలాదిమందిని తమ స్వగ్రామాలకు చేరవేయడంతోపాటు, అనేకమందికి విద్యా, వైద్యం కోసం నిరంతరాయంగా సాయం చేస్తున్న దేవుడు సోనూసూద్ అంటూ ట్వీట్ చేస్తున్నారు. నిజాయితీగల ఇండియన్ ఐడల్ అంటూ సోనూసూద్‌కు భారీ మద్దతు పలుకుతున్నారు. ఐసపోర్ట్ సోనూసూద్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లో నిలిపారు. కరోనా కష్టకాలంలో పేదల పాలిట పెన్నిధిగా అడిగినవారికి కాదనకుండా సాయం చేసే రియల్ హీరోగా సోనూ సూద్ అవతరించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి అనేక కార్యక్రమాలతో నిర్మాణాత్మకంగా తన సేవను కొనసాగిస్తున్నారు. ఇక నటనపరంగా చూస్తే అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ చిత్రంలో చంద్ బర్దాయిగా కనిపించనున్నారు. మానుషి చిల్లార్ సంజయ్ దత్ నటించిన ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ నవంబర్ 5న థియటర్లను పలకరించనుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా, సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘ఆచార్య’ కూడా ఏడాది మే 13 న విడుదల కానుంది. కాగా ఇలాంటి ఆన్లైన్ ట్రోలింగ్‌కు సోనూసూద్ గతంలోనే గట్టి కౌంటర్ ఇచ్చారు. మానవత్వంతో స్పందించి, సాయం చేయడమే తన విధి, ‘సామాన్యుడికి’ మాత్రమే జవాబుదారీగా ఉంటానని క్లారిటీ ఇచ్చారు. ఈ ట్రోలింగ్ వెనుక నేపథ్యం, ఎవరున్నారో తనకు తెలుసు కాబట్టి, వీటికి స్పందించాల్సిన అవసరం లేదని ఒక ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. అంతేకాదు నెగిటివిటీ ట్రోలింగ్ చేసేవారి డీఎన్ఏలోనే ఉంది .. కానీ నలుగురికీ ఉపయోగపడే పనిచేసుకుంటూ పోవడమే తన పని అని సోనూ సూద్ స్పష్టం చేశారు. शिव भगवान की फोटो फॉरवर्ड करके नहीं किसी की मदद करके महाशिवरात्रि मनाएं। ओम नमः शिवाय । — sonu sood (@SonuSood) March 11, 2021 On Other's festivals On Hindu's Festivals #WhoTheHellAreUSonuSood@TheDeepak2020In pic.twitter.com/zhs7C1NNWg — Abhijeet vishnoi (@abhi029_vishnoi) March 11, 2021 #WhoTheHellAreUSonuSood He’s the guy who came on roads to help thousands of migrants when their elected Government abandoned the poor souls to die during the unprecedented lockdowns. Don’t know about acting skills as I do not watch movies, but @SonuSood is an honest Indian Idol. pic.twitter.com/l5WokAtrtC — 𝐉𝐨𝐫𝐝𝐚𝐧 (@aka_dpu) March 11, 2021 He’s the guy who came on roads to help thousands of migrants when their elected Government abandoned the poor souls to die during the unprecedented lockdowns. I don't think he did anything wrong. I firmly stand with him.@SonuSood#ISupportSonuSood #ISupportSonuSood — Suv Bhardwaj (@BhardwajSuvm) March 11, 2021 -
క్షీర రామ లింగేశ్వర స్వామి దేవాలయంపై సాక్షి ప్రత్యేక కథనం
-
పట్టిసీమ వీరభదేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
-
సోమవారం మార్కెట్లకు సెలవు
సాక్షి, ముంబై: మహాశివరాత్రి సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవు. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం(5న) యథావిధిగా ఉదయం 9.15కు ప్రారంభమవుతుంది. భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్ మార్కెట్లు భారీస్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూశాయి. చివరికి శుక్రవారం సెన్సెక్స్ నికరంగా 192 పాయింట్లు(0.55 శాతం) బలపడి 36,064 వద్ద నిఫ్టీ 72 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 10,863 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. -
ఆసక్తిగా మారిన మెగా క్లాష్
-
వీరభద్రుని ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
-
పులకించిన ప్రశాంతి నిలయం
ఘనంగా శివరాత్రి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో మహారుద్రాభిషేక ఘట్టం పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సన్నిధిలో శివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది భక్తులు సత్యసాయి మహాసమాధి చెంత శివనామాన్ని స్మరిస్తూ సాయీశ్వర లింగానికి అభిషేకం చేస్తూ పరవశించిపోయారు. శుక్రవారం ఉదయం వేడుకలు వేదపఠనం, సత్యసాయి యూనివర్శిటీ విద్యార్థులు నాదస్వరం, పంచవాయిద్యాలతో ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు ఆర్జే రత్నాకర్రాజు, ఇతర ట్రస్ట్ సభ్యులతో కలసి సత్యసాయి పరమభక్తుడు అజిత్పోపట్ రచించిన ‘ది డివైన్ పప్పెటీర్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. సత్యసాయి బాబా 2001 నుంచి 2010 మధ్యకాలంలో భక్తులనుద్దేశించి ఇచ్చిన 65 ప్రసంగాల సమాహారాన్ని ఇందులో పొందుపరిచారు. అనంతరం సత్యసాయి మహాసమాధి చెంత వేదపండితులు మహారుద్రాభిషేకం నిర్వహించారు. సాయికుల్వంత్ సభా మందిరంలోని భజన మందిరంలో పండితుల వేదపఠనం నడుమ గణపతిపూజ, కుంకుమపూజ, కళశపూజ తదితర పూజాక్రతువులు నిర్వహించారు. మహారుద్రాభిషేకం ముగిసిన అనంతరం సాయీశ్వరున్ని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. వేడుకల్లో తెలంగాణ ఐజీ చారుసిన్హా, సత్యసాయి ట్రస్ట్ సభ్యులు విజయభాస్కర్, ప్రసాద్‌రావు, నాగానంద, సత్యసాయి సేవా సంస్థల దేశీయ అధ్యక్షుడు నిమిష్‌పాండ్య పాల్గొన్నారు. -
ప్రతిధ్వనించిన పంచాక్షరి.. పరవళ్లు తొక్కిన భక్తఝరి
- ఊరూరా మహాశివరాత్రి వేడుకలు -వేకువ నుంచే పుణ్యస్నానాలు, దర్శనాలు -కళకళలాడిన ప్రముఖ శైవక్షేత్రాలు ప్రతి ఊరిలో, ప్రతి ఏరులో.. ఎక్కడ చూసినా వెండికొండ వేలుపు పండగ సందడే. ఎక్కడ విన్నా ‘నమశ్శివాయ’ ఆ పరమేశుని నామస్మరణే. శుక్రవారం వేకువకు ముందే నీటిపట్టులకు భక్తజనం పోటెత్తారు. పావన స్నానాల అనంతరం పార్వతీనాథుని కోవెలల వద్ద బారులు తీరారు. మహా శివరాత్రి పర్వం సందర్భంగా జిల్లాలో వనసీమ నుంచి కోనసీమ వరకూ భక్తిప్రపత్తులు పరవళ్లు తొక్కాయి. సామర్లకోట, పాదగయ, ద్రాక్షారామ, కోటిపల్లి వంటి ప్రముఖ శైవ క్షేత్రాలతో పాటు ప్రతి ఊరిలో ఆ మహాదేవుడు కొలువైన ఆలయాలు కళకళలాడాయి. పలు ఆలయాల వద్ద గంగాధరునికి అభిషేకాలు, రథోత్సవాలు, కల్యాణోత్సవాలు కనులపండుగలా జరిగాయి. అనేకులు హృదయం నిండా గౌరీపతిని నింపుకొని శుక్రవారం రేయంతా జాగరణ చేశారు. కోరిన వరాలిచ్చే బోళాశంకరుని మహాపర్వంలో స్వచ్ఛందసేవలు వెల్లువెత్తాయి. పన్నగధారి పండుగలో అన్నపానీయాల వితరణకు హద్దే లేదంటే అతిశయోక్తి కాదు. అర్ధరాత్రి నుంచే భీమేశునికి అర్చనలు సామర్లకోట :పంచారామ క్షేత్రమైన శ్రీకుమారరామ భీమేశ్వరాలయాన్ని అర్ధరాత్రి 12.15 గంటలకు తెరిచి స్వామి వారికి తొలి అభిషేకం, పూజలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు స్వామి వారిని, బాలాత్రిపురసుందరీదేవిని దర్శించుకున్నారు. పట్టణానికి దూరంగా గోదావరి కాలువ ఆవలివైపు ఆలయం ఉన్నా కిలోమీటరు పొడవున భక్తులు బారులు తీరి, స్వామి వారిని దర్శించుకున్నారు. సోమేశ్వరుని సన్నిధికి పోటెత్తిన భక్తులు కోటిపల్లి(కె.గంగవరం) : కోటిపల్లిలో కొలువైయున్న శ్రీ ఛాయా సోమేశ్వరస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు లక్ష మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రామచంద్రపురం సీఐ శ్రీధర్‌కుమార్, ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పడవలు, గత ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం చేశాయి. పాదగయకు భక్తజన వరద పిఠాపురం : పాదగయ పుణ్యక్షేతానికి గురువారం అర్ధరాత్రి నుంచే భక్తులు ఆలయం చేరుకున్నారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరీదేవి, పురుహూతిక అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో పిఠాపురమే జనసంద్రంగా మారింది. గురువారం అర్ధరాత్రి తర్వాత స్వామికి లక్షపత్రి పూజలు, అభిషేకాలు, మంత్రపుష్పాలు, బిళ్వార్చన, అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించి సర్వదర్శనం కొనసాగించారు. సాయ్రంతం స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక అలంకరణ చేశారు. కార్మికమంత్రి కె.అచ్చెన్నాయుడు, పలువురు ప్రముఖులు స్వామి వార్ని దర్శించుకున్నారు. పాదగయ వద్ద బ్రహ్మకుమారీస్ సంస్థ 81 రకాల విత్తనాలతో తయారు చేసిన శివలింగం, అంబికా దర్బారు బత్తి సంస్థ స్వామికి సమర్పించిన 7 అడుగుల భారీ అగరుబత్తీ ఆకట్టుకున్నాయి. ద్రాక్షారామ భీమేశునికి ఏకాదశ రుద్రాభిషేకం ద్రాక్షారామ(రామచంద్రపురం రూరల్) : పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే సప్తగోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీమాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రుత్విక్కులు, వేదపండితులు ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామిని కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరం తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం కల్చరల్ : గంగమ్మను తలపై దాల్చిన శివయ్య నామస్మరణతో గోదావరీతీరం మారుమోగింది. ఎక్కడ విన్నా పంచాక్షరీపారాయణలే, ఎటుచూసినా అభిషేకప్రియునికి అఖండ పంచామృతాభిషేకాలే. పుష్కరఘాట్, కోటిలింగాలఘాట్, మార్కండేయఘాట్, గౌతమఘాట్.. ఏ రేవు చూసినా భక్తజనుల వెల్లువలే. శ్రీఉమాకోటిలింగేశ్వరస్వామి రథయాత్ర కన్నులపండువగా సాగింది. శ్రీఉమామార్కండేయేశ్వరస్వామి ఆలయంలో శివపార్వతుల కల్యాణమహోత్సవం వైభవంగా జరిగింది. రాజగురు, ఆగమాచార్య డాక్టర్ ఎం.ఆర్.వి.శర్మ కల్యాణానికి వ్యాఖ్యానం చేశారు. ‘శివం’ అన్న శబ్దానికి మంగళమని అర్థమని వివరించారు. గోదావరిగట్టుపై ద్విచక్రవాహనాలకు మించి, మిగతా వాహనాలను అనుమతించలేదు. కమనీయం కొప్పేశ్వరుని రథోత్సవం కొత్తపేట : పలివెలలో ఉమా కొప్పేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం సాయంత్రం కోలాహలంగా జరిగింది. ఉత్సవాన్ని ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు.ముందుగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, లావణ్యవేణి దంపతులు, తరువాత ఎమ్మెల్సీ ఆర్ఎస్, ఎంపీపీ అనంతకుమారి దంపతులు స్వామి,అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. -
శివార్చన
-
శివరాత్రికి 340 ప్రత్యేక బస్సులు
కర్నూలు(రాజ్‌విహార్): మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని పలు డిపోల నుంచి శైవక్షేత్రాలకు 340 ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు రీజినల్ మేనేజరు వెంకటేశ్వర రావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కొత్త బస్టాండ్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. శుక్రవారం శివరాత్రి సందర్భంగా శ్రీశైలంతో పాటు ఇతర శైవ క్షేత్రాలకు ఈ బస్సులు నడుపుతామన్నారు. మొత్తం 340 బస్సుల్లో జిల్లా డిపోలకు చెంది 140 బస్సులు కాగా అనంతపురం, నెల్లూరు, తిరుపతి రీజియన్లకు చెందిన 200 బస్సులు తెప్పిస్తున్నట్లు తెలిపారు. బస్సులు ఘాట్‌లో నడిచేందుకు ఫిట్‌గా నిర్వాహణ పనులు చేయించామని, సెక్యూరిటీ వ్యవస్థను కూడా పటిష్టపరిచినట్లు వెల్లడించారు. ప్రయాణికుల సురక్షితాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఎయిడ్ బాక్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రద్దీకి తగ్గట్లు శ్రీశైలం, మహనంది, కొలనుభారతి, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి, రాయచూరు, సంమేశ్వరం, గురజాల, బ్రహ్మగుండంకు ఈ బస్సులు తిప్పుతామన్నారు. స్పెషల్ ఆపరేషన్స్‌లో భాగంగా ఓవరాల్‌గా ఈడీ రామారావు పర్యవేక్షిస్తారని, మెకానికల్ మొబైల్ టీం, హెల్ప్‌లైన్ సెంటర్లు, ట్రాఫిక్ సిబ్బందిని నియమించడంతోపాటు, ప్రతి డిపో వద్ద సమాచార కేంద్రాలు, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నేత్రపర్వం భీమేశ్వరుని పరిణయం
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన శ్రీకుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో స్వామి కల్యాణం బుధవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామికి, బాల త్రిపుర సుందరిదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఉత్సవ విగ్రహాలకు నంది వాహనంపై గ్రామోత్సం నిర్వహించారు. రాత్రి విగ్రహాలకు ధ్వజారోహణ అనంతరం ఆలయం తోటలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వేదికపై స్వామి, అమ్మవారి విగ్రహాలను ఉంచి వేద పండితులు కల్యాణం జరిపిం చారు. అన్నవరం ఆలయ ఈఓ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆ ఆలయ వేదపండితులు, స్థానిక ఆలయ వేదపండితులు కల్యాణం నిర్వహించారు. కంచికామకోటి పీఠం ఆస్థాన పండితుడు చంద్రాభట్ల చింతామణిగణపతిశాస్త్రి, ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్మోహన్, సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, బి.త్రిమూర్తులు, చుండ్రు సూర్యభాను, గొల్లపల్లి కామరాజు, దూది రాజు, బలుసు శ్రీనివాసు, ఇమ్మంది వెంకటేశ్వరరావు, ఆలయ భక్త సంఘం నాయకులు బిక్కిన సాయిపరమేశ్వరరావు, చుండ్రు గోపాలకృష్ణ, చుండ్రు వాసు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పారిశ్రామిక వేత్తలు కర్రి సత్యనారాయణ, పసల పద్మరాఘవ రావు, డాక్టరు పసల సత్యానందరావు, మట్టపల్లి రమేష్, గంజి, బూరయ్య, సీసీఎస్ రాజు ఆర్వీ సుబ్బరాజు, ఆర్ వీరభద్రరావు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 27న స్వామి శ్రీపుష్పయాగోత్సవం జరుగుతుంది. కమనీయం కుక్కుటేశ్వరుని కల్యాణం పిఠాపురం : ‘దక్షిణ కాశీ’గా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంలోని శ్రీకుక్కుటేశ్వరస్వామి కల్యాణం బుధవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. భక్త జనసందోహం నడుమ స్వామి, శ్రీరాజరాజేశ్వరి అమ్మవార్ల పరిణయం ఆద్యంతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం భక్తుల ఆధ్వర్యంలో స్వామి, అమ్మ వార్లను పెళ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలను చేశారు. అనంతరం స్థానిక శ్రీరామకృష్ణ వాసవీ కన్యకాపరమేశ్వరీ కల్యాణ మండపం వద్ద ఎదురు సన్నాహం నిర్వహించారు. గజవాహనంపై గ్రామోత్సవం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టు వస్రా్తలు, నగలతో అలంకరించి, ఊరేగింపుగా తీసుకు రంగు రంగుల విద్యుత్ దీపాలు, పువ్వులతో సుందరంగా అలంకరించిన కల్యాణ వేదికపై అధిష్టింపచేశారు. వేదపండితులు చెరుకుపల్లి విశ్వనాథశర్మ, ద్విభాష్యం సుబ్రహ్మణ్యశర్మల ఆధ్వర్యంలో అర్చకులు విష్వక్సేన పూజతో కల్యాణాన్ని ప్రారంభించారు. రాత్రి 8.32 గంటలకు స్వామి వారి కల్యాణం కనులపండువగా నిర్వహించారు. పుణ్యాహవచనం, కంకణధారణ, సుముహూర్తం, కన్యాదానం, మంగళసూత్రధారణ, యజ్ఞోపవీతధారణ, తలంబ్రాలు, ఆశ్వీరచనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణల మధ్య జరిగిన కార్యక్రమంలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ దంపతులు, ఈవో చందక దారబాబు, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కొండేపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
20 నిమిషాల్లోనే శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనం
శ్రీకాళహస్తి: మహాశివరాత్రి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని ఏర్పాటుచేస్తోంది. రూ.500 టికెట్టుతో కేవలం 20 నిమిషాల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. శుక్రవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని లక్షకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక దర్శనం టోకెన్లు పొందాలంటే ఏదైనా గుర్తింపు కార్డును జతచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఒకరోజు ముందు కొనుగోలు చేసే భక్తులకు రూ.250 రాయితీ ప్రకటించారు. సాధారణ భక్తులకు తిరుమల తరహాలో మహాలఘు దర్శనం అమలు చేస్తామన్నారు. మహాశివరాత్రికి ఆలయాన్ని తోరణాలు, విద్యుత్ లైట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
అంతా శివమయం
రామతీర్థం(నెల్లిమర్ల), : రాష్ట్రంలో రెండో భద్రాద్రిగా పేరుగాంచిన రామతీర్థానికి శివరాత్రి మరుసటి రోజైన శుక్రవారం కూడా భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినంకంటే మరుసటి రోజునే లక్షలాదిమంది భక్తులు వచ్చి ఇక్కడి సీతారాములు, శివుడ్ని దర్శించుకున్నారు. గురువారం రాత్రంతా భక్తులు దేవస్థానానికి వస్తూనే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకు రద్దీ కొనసాగింది. రెండురోజుల్లో మొత్తం నాలుగు లక్షలమంది భక్తులు హాజరైనట్లు దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదితో పోల్చిచూస్తే ఈ ఏడాది భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నట్లు గుర్తించారు. అయితే శుక్రవారం మా టత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అధికసంఖ్యలో భక్తులు వచ్చారు. వేకువజామున రద్దీ మరింత ఎక్కువైంది. ఇటు గొర్లిపేట నుం చి రామతీర్థం దాకా రోడ్డంతా భక్తులతో నిండిపోయింది. వాహనాలను సీతారామునిపేట జంక్షన్‌లోనే నిలిపివేసినప్పటికీ నెల్లిమర్ల రహదారి భక్తులతో కిక్కిరిసింది. ఒకదశలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తు నిర్వహించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అలా గే అటువైపు దేవుని నెలివాడ నుంచి ఆలయందాకా రోడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా దేవస్థానం ముందున్న తిరువీధి ఇసుక వేస్తే రాలనంతా భక్తులతో నిండిపోయింది. మధ్యాహ్నం మూడుగంటలదాకా స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఈసారి రెండువైపులా ద్వారాలు తెరిచి దర్శనాలకు అనుమతించడంతో భక్తులు గతంలో మాదిరి ఇబ్బంది పడలేదు. క్షేత్రపాలకుడు శ్రీఉమా సదాశివస్వామి ఆలయానికి ఈ సారి భ క్తులు పోటెత్తారు. లోపలికి వెళ్లేందుకు చాంతాడంత క్యూ ఉండడంతో ఆలయం వెలుపలే కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించడం కనిపించింది. జాగారం చేసిన భక్తులు శుక్రవారం అధిక సంఖ్యలో బోడికొండ ఎక్కి, అక్క డి కోదండరామ స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవ ప్రత్యేకాధికారి ఎన్వీఎస్ఎ న్ మూర్తి, ఈఓ బాబూరావు భక్తులకు అసౌకర్యం కలగకుండా పర్యవేక్షించారు. రామతీర్ధంలో రెండు రోజుల పాటు భక్తులకు పలు స్వచ్ఛంద సంస్థలు సేవలందించాయి. -
హర హర మహాదేవ
-
శివరాత్రికి ముస్తాబైన వేములవాడ