నేడు శ్రీసిటీలో పెప్సికో ప్లాంటు ప్రారంభం | Naidu, Indra Nooyi to visit PepsiCo facility at Sri City on April 3 | Sakshi
Sakshi News home page

నేడు శ్రీసిటీలో పెప్సికో ప్లాంటు ప్రారంభం

Published Fri, Apr 3 2015 1:09 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

నేడు శ్రీసిటీలో పెప్సికో ప్లాంటు ప్రారంభం - Sakshi

నేడు శ్రీసిటీలో పెప్సికో ప్లాంటు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, పెప్సికో సీఈఓ ఇంద్ర నూయి రాక
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పెప్సికో సీఈఓ ఇంద్ర నూయిలు శుక్రవారం చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌ను సందర్శించనున్నారు. అక్కడ రూ.500 కోట్ల వ్యయంతో నెలకొల్పిన పెప్సికో ప్లాంటును సీఎం ప్రారంభిస్తారు. మొత్తం రూ.1,800 కోట్ల వ్యయంతో వివిధ దశలలో ఈ ప్లాంటును విస్తరించాలన్నది ఆ కంపెనీ ప్రణాళిక. దక్షిణ భారతదేశంలో పెప్సికో వ్యాపారానికి ఈ ప్లాంటు కీలకం కాబోతోందని, తద్వారా రాష్ట్రానికి మరిన్ని ఉద్యోగావకాశాలు లభించవచ్చని అంచనా.  రాష్ట్రంలో ఏఏ రంగాలలో తోడ్పాటు అందించేందుకు అవకాశాలున్నాయి? ఏఏ రంగాలలో భాగస్వామ్యం వహించే వీలున్నది? అనే అంశాలపై ఇంద్ర నూయి సీఎంతో ఈ పర్యటనలో చర్చించనున్నారు. ఇంద్రనూయితో భేటీ తర్వాత చంద్రబాబు శ్రీసిటీలో నెలకొల్పిన పలు పారిశ్రామిక యూనిట్లను ప్రారంభిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement