శ్రీసిటీకి సీఎం వరాలు
సత్యవేడు: శ్రీసిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. బుధవారం శ్రీసిటీలోని ఇసుజు కార్ల కంపెనీ ప్రారంభోత్సవాన్నికి హాజరైన ముఖ్యమంత్రి ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. శ్రీసిటీలో ప్రస్తుతం ఉన్న పోలీస్ ఔట్ పోస్టు స్థాయిని పెంచి డీఎస్‌స్పీ ఆధ్వర్యంలో పనిచేసేట్లు పూర్తిస్థాయి పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేస్తామని తెలిపారు. కార్మికులకు నివాస సముదాయాలు, గ్రామీణ యువతకు వివిధ వృత్తుల్లో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు ఒక శిక్షణా సంస్థ ఏర్పాటు చేస్తామని వరాలు ఇచ్చారు.
ఇసుజులో 2వేల మందికి ఉపాధి
శ్రీ సిటీలో నెలకొల్పిన ఇసుజు కంపెనీ వల్ల 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. శ్రీ ఇసుజు కంపెనీని 107 ఎకరాల స్థలంలో రూ.3వేల కోట్లు పెట్టుబడితో నిర్మించారని ఆయన తెలిపారు. ఏడాదికి 1.2 లక్షల ఇసుజు వాహనాలు ఉత్పత్తి చేస్తారని వివరించారు. ఇసుజూ కంపెనీ ప్రారంభించడం వల్ల ఆ కంపెనీకి వివిధ విడి భాగాలను సరఫరా చేసే అనుబంధ సంస్థలు కూడా త్వరలో శ్రీసిటీకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావు, రాష్ర్టముఖ్య మంత్రులు గోపాల కృష్ణారెడ్డి, నారాయణ, ఎమ్మెల్యే ఆదిత, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ తదితరులుపాల్గొన్నారు.