శ్రీసిటీలో నేడు 16 పరిశ్రమలకు సీఎం చంద్రబాబు మళ్లీ ప్రారంబోత్సవం.. ఎనిమిది పరిశ్రమలకు మళ్లీ భూమి పూజ
వీటన్నింటిలో గత జగన్ ప్రభుత్వంలోనే ఉత్పత్తి ప్రారంభం
పరిశ్రమలు క్యూ కట్టాయని చెప్పుకునేందుకు పాట్లు
నేడు శ్రీసిటీలో సీఎం చంద్రబాబు పర్యటన
శ్రీసిటీ (వరదయ్యపాళెం): డప్పు కొట్టుకోవడంలో సీఎం చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని మరోమారు స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండు నెలలకే రాష్ట్రంలో పరిశ్రమలు క్యూ కడుతున్నాయని ఎల్లో మీడియా ద్వారా గ్లోబల్ ప్రచారం చేసుకునేందుకు వ్యూహం రూపొందించారు. శ్రీసిటీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రారం¿ోత్సవాలు చేసిన పరిశ్రమలకే మళ్లీ ప్రారం¿ోత్సవాలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.
అంతా సిద్ధమైపోయాక సీఎం పర్యటనను ఖరారు చేశారు. దీంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన పరిశ్రమలకు ప్రారం¿ోత్సవాలు, భూమిపూజలు, ఎంఓయూలు మరోమారు చంద్రబాబు చేతుల మీదుగా చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 పరిశ్రమలకు నేడు ప్రారంభోత్సవాలు చేసేందుకు సీఎం చంద్రబాబు శ్రీసిటీ వస్తున్నారు.
ఎల్‌ల్జీ పాలిమార్స్, నైడెక్, ఈప్యాక్ డ్యురబుల్స్, న్యుయోలింక్ టెలి కమ్యూనికేషన్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, జెన్‌లెనిన్ ఇంటర్నేషనల్, బెల్ ఫ్లెవర్స్, జేజిఎల్ మెటల్ కన్వర్టర్స్, త్రినాథ్ ఇండస్ట్రీస్, ఎవర్ షైన్ మౌల్డర్స్, ఆటో డేటా, ఈఎస్‌ఎస్ కీ కాంపొనెంట్స్, అడ్మైర్ కేబుల్స్, బాంబై కోటెడ్ స్పెషల్ స్టీల్, శ్రీలక్ష్మీ ఆగ్రో ఫుడ్స్ పరిశ్రమలు గత ప్రభుత్వంలో ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభించాయి.
ఇప్పుడు వీటినే సీఎం మరోమారు ప్రారంభించనున్నారు. రూ.1,570 కోట్ల పెట్టుబడులతో ఈ పరిశ్రమలు ఏర్పాటయ్యాయని ప్రచారం చేసుకోనున్నారు. మరో రూ.900 కోట్లతో ఇంకో 8 పరిశ్రమలకు భూమి పూజ, ఐదు పరిశ్రమలతో ఎంవోయూ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment